Monday, December 23, 2024

కూతురుని చంపి….. అదృశ్యమైందని పిఎస్ లో ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

లక్నో: మైనర్ బాలిక ఓ యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఆమెను తండ్రి హత్య చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం షాజాహన్‌పూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సిందౌళి జిల్లాలో తన కూతురు కనిపించడంలేదని జనవరి 15న స్థానిక పోలీస్ స్టేషన్‌లో తండ్రి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేశారు. ఎక్కడ బాలిక ఆచూకీ కనిపించలేదు. తన కూతురు అదృశ్యం వెనుక ఇండోర్‌లో ఉన్న యువకుడేనని బాలిక తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు. జనవరి 24న బాలిక మృతదేహం విల్లపే చెరువులో కనిపించడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెంటనే ఆమె కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నిజాలు ఒప్పుకున్నాడు. ఓ యువకుడి తన కూతురుతో అక్రమ సంబంధం పెట్టుకుంది. అతడితో దూరంగా ఉండాలని తన కూతురుని పలుమార్లు తండ్రి హెచ్చరించినప్పటి ఆమె పట్టించుకోలేదు. ఇదే విషయంలో జనవరి 21న కూతురు, తండ్రి మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో తండ్రి ఇటుకతో కూతురు తలపై బాదాడు. దీంతో ఘటనా స్థలంలోనే కూతురు చనిపోయింది. వెంటనే మృతదేహాన్ని స్థానికంగా ఉన్న విల్లపే చెరువులో పడేశామని ఒప్పుకున్నారు. తండ్రిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News