Thursday, January 9, 2025

కుమార్తెను గొడ్డలితో నరికి… పిఎస్ లో లొంగిపోయిన తండ్రి

- Advertisement -
- Advertisement -

 

Father killed daughter in Wanaparthy

 

మనతెలంగాణ/ వనపర్తి న్యూస్: పదిహేనేళ్ల కుమార్తెను గొడ్డలితో తండ్రి నరికి చంపిన సంఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామంలో జరిగింది. అనంతరం నిందితుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పాతపాల్లి గ్రామంలో సునీత-రాజశేఖర్ అనే దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆ దంపతులకు ఇద్దరు కమార్తెలు, కుమారుడు ఉన్నాడు. చిన్న కూతురు గీత స్థానిక ప్రభుత్వ స్కూళ్లలో పదో తరగతి చదువుతోంది. బాలిక అదే గ్రామానికి చెందిన అబ్బాయితో చనువుగా ఉండడంతో పలుమార్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంట్లో గీత, రాజశేఖర్ ఉన్నారు. మంచిగా చదువుకోవాలని, అబ్బాయితో చనువుగా ఉండొద్దని హెచ్చరించాడు. దీంతో ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో ఆమె మెడపై గొడ్డలితో వేటువేశాడు. ఆమె చనిపోయిందని నిర్థారించుకున్న తరువాతన స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించామని డిఎస్‌పి ఆనంద్ రెడ్డి తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News