ఎల్బీనగర్ : ఏనిమిదేళ్ల ఏళ్ల కన్న కూతురిని కసాయి తండ్రి కిరాతకంగా చంపిన ఘటన అబ్దల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వనస్థ్దలిపురం ఏసిపిలో కార్యాలయంలో శనివారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వనస్థలిపురం ఏసిపి భీంరెడ్డి, అబ్దుల్లాపూర్‌మెట్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మన్‌మోహన్‌లు నిందితుడి వివరాలు వెల్లడించారు. నగరంలో బిహెచ్‌ఈఎల్ చందానగర్‌కు చంద్రశేఖర్ (40) ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ నగరంలో బిహెచ్‌ఈఎల్ చందానగర్‌లో నివాసం ఉంటున్నాడు. చంద్రశేఖర్‌కు హిమతో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి మోక్షజ్ఞ (8) అనే కూతురు ఉంది. చంద్రశేఖర్, హిమ దంపతులు గత కొన్ని నెలలుగా విడిగా ఉంటున్నారు. ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. ఈ మధ్యే చంద్రశేఖర్ ఉద్యోగాన్ని కోల్పోయాడు. మోక్షజ్ఞ తల్లి హిమ దగ్గర ఉంటుంది. బిహెచ్‌ఈఎల్‌లో మోక్షజ్ఞ జ్యోతి విద్యాలయ హైస్కూల్‌లో విద్యాభాస్యం చేస్తుంది. తన ఉద్యోగం కోల్పోయిన పోయిందని తన భార్య మాత్రం సంతోషంగా ఉద్యోగం చేస్తుందని తరువాత అసహనానికి గురైయ్యాడు.
దీంతో మోక్షజ్ఞ చదువుకుంటున్న పాఠశాలకు శుక్రవారం సాయంత్రం 3.15 నిమిషాలకు వెళ్లాడు. పాపను కారులో తీసుకొని బయటికి వెళ్లాడు. పాపను వెనుక సీటులో కూర్చోబెట్టుకొని ఆర్‌సీపురం తీసుకోని వెళ్లి కారును ఆపాడు. పాపకు తన ఇబ్బందులు తెలియజేశాడు. పాప అమ్మతో మాట్లాడి విషయం తెలిపాలని తెలిపింది. అనంతరం కారులో కాస్త దూరం వెళ్లిన తర్వాత తన వెంట తెచ్చుకున్న బ్లేడుతో మోక్షజ్ఞ గొంతు కోసి చంపేశాడు. అనంతరం ఔటర్ రింగ్‌రోడ్డు ద్వారా విజయవాడ దారిలో నగరం శివారు ప్రాంతంలో మృతదేహన్ని పడేవేయాలని పన్నాగంతో కోహెడ ఎక్స్ రోడ్డు చేరుకున్నాడు. కోహెడ ఎక్స్ రోడ్డు వద్ద కారు కుడి టైర్ పగిలిపోయింది. దీంతో స్థ్దానికులు 100 డయల్ సమాచారం అందించారు. దీంతో అబ్దుల్లాపూర్ పోలీసులు సంఘటనా స్థ్దలానికి చేరుకొని పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకొని విచారించగా తన భార్య ఆనందాన్ని దూరం చేసేందుకే కూమారైను హత్య చేసినట్లు చంద్రశేఖర్ తెలిపాడు. పాప మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు నుంచి టయోట కారు నెంబర్ ఎపి 28 డిబ్లు 4667, పెన్సిల్, పేపర్ కట్టర్ కత్తి , సామసంగ్ సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకొని రిమాండుకు తరలించారు.