Tuesday, January 7, 2025

తండ్రి చేతిలో కూతురు దారుణ హత్య..

- Advertisement -
- Advertisement -

మంథని రూరల్: మండలంలోని బట్టుపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కన్న కూతురిని అతి కిరాతకంగా తండ్రి నరికి చంపిన ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్లితే మండలంలోని బట్టుపల్లి గ్రామంలో రజిత(10) తండ్రి గుండ్ల సదయ్య గొడ్డలితో నరికి చంపాడు. అయితే గత కొంత కాలంగా సదయ్య మానసిక స్థితి సరిగా లేక గ్రామంలో జనాలపై తరుచుగా దాడులు చేస్తున్నాడని స్థానికులు తెలిపారు. కూతురును చంపిన తర్వాత అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి దూపం శ్రీనివాస్‌పై కూడా దాడికి పాల్పడ్డాడు.

గుండ్ల సదయ్య తరుచు గ్రామంలో అందరితో గొడవ పడేవాడని కన్న కూతురిని హతమార్చిన అనంతరం గ్రామంలోని శ్రీనివాస్‌పై దాడి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకోగానే గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామస్తుల దాడిలో పోలీసుల వాహనాలు ధ్వంసమైనాయి. గ్రామస్తులను అక్కడిని పంపి, పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నింధితున్ని పోలీసులు అదుపులోకి తీసుకుని సీఐ సతీష్, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News