Wednesday, December 25, 2024

భార్యపై అనుమానంతో కూతురిని చంపిన కసాయి

- Advertisement -
- Advertisement -

బిజినపల్లిః భార్యపై అనుమానంతో కన్న కూతురిని గొంతునులిమి చంపిన తండ్రి సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా, బిజినపల్లి మండలంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ గోపాల్‌నాయక్ తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని రామ్‌రెడ్డిపల్లి తండాకు చెందిన తిరుపతి నాయక్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. హైదరాబాద్‌లో మియాపూర్‌కు చెందిన శివలీలతో రెండేళ్ల క్రితం అతనికి వివాహమైంది. వారికి 14 నెలల కుమార్తె ఉంది. భార్యపై అనుమానం పెంచుకున్న ఆమెను వేధిస్తుండడంతో భార్య మూడు నెలలుగా మియాపూర్‌లోని తన తల్లి ఇంటి వద్ద ఉంటోంది.

శనివారం స్వగ్రామానికి రావాలని భార్య వద్దకు ఆయన వెళ్లగా అందుకు ఆమె నిరాకరించింది. దీంతో కూతుర్ని తన వెంట ఆటోలో స్వగ్రామానికి రామిరెడ్డిపల్లి తండాకు తీసుకువెళ్తానని భార్యని ఒప్పించి వెంట తీసుకువచ్చాడు. శనివారం రాత్రి హైదరాబాద్ శివారులో మద్యం సేవించి నిర్మానుష్య ప్రదేశంలో చిన్నారి గొంతు నులిమి చంపేశాడు. ఆదివారం తెల్లవారుజామున మూడు గంటలకు బిజినపల్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఘటనపై నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News