Thursday, December 19, 2024

కొత్తగూడెంలో దారుణం.. కన్న కొడుకును గొడ్డలితో నరికి చంపిన తండ్రి..

- Advertisement -
- Advertisement -

భద్రాద్రిః కన్న తండ్రే కొడుకును దారుణంగా హత్య చేసిన ఘటన కొత్తగూడెంలో చోటుచేసుకుంది. అవివాహితుడైన కొడుకు శంకర్‌(35)ను తండ్రి రాజయ్య గొడ్డలితో నిరికి చంపిన సంఘటన గౌతమ్ నగర్ కాలనీలో కలకలం సృష్టించింది. కుమారుడు శంకర్ బలాదూర్‌గా తిరుగుతూ.. మద్యానికి బానిసై తరచు కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడని స్థానికులు చెబుతున్నారు. ఈరోజు ఉదయం కూడా ఇంట్లో గొడవ చేస్తుండడంతో విసిగెత్తిన తండ్రి రాజయ్య కోపంలో పక్కనే ఉన్న గొడ్డలితో హత్య చేసినట్లు తెలుస్తోంది. కుమారుడిని హత్య చేసిన అనంతరం రాజయ్య పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు.

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News