Sunday, December 22, 2024

మూడో కాన్పులో కూతురు… పసికందును నేలకేసి కొట్టి…

- Advertisement -
- Advertisement -

లక్నో: మూడోసారి కూతురు జన్మించిందని తండ్రి రెండు రోజుల పసికందును నేలకేసి కొట్టి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పురాన్‌పూర్ కొట్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఐదు సంవ్సరాల క్రితం సిర్సా గ్రామానికి చెందిన మహ్మాద్ ఫర్హాన్ అనే వ్యక్తి శబో బేగమ్‌ను వివాహం చేసుకున్నాడు. ఫర్హాన్ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇప్పటికే ఫర్హాన్‌కు ఇద్దరు కూతుళ్లు పుట్టారు. మూడో సారి బేగమ్ గర్భవతి కావడంతో కూతురు పుడితే చంపేస్తానని భర్త ఆమెను పలుమార్లు బెదిరించడంతో పాటు దాడి చేశాడు. మళ్లీ ఆడ పిల్ల పుడితే విడాకులు ఇస్తానని పలుమార్లు భర్త భార్యకు తలాక్ చెప్పాడు. మూడో కాన్పులో మళ్లీ కూతురు జన్మించడంతో పర్హాన్ ఆగ్రహంతో రగిలిపోయాడు.

Also Read: రైతులకు కెసిఆర్ బంధువు: గంగుల

రెండు రోజులు పసికందుకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో మెటర్నరీ క్లినిక్‌కు తీసుకొచ్చారు. రెండు రోజుల పసికందును తండ్రి తన చేతిలోకి తీసుకొని నేలకేసి బాదాడు. దీంతో పసికందు ఘటనా స్థలంలోనే చనిపోయింది. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పురాన్‌పూర్ కొట్వాలి ఎస్‌హెచ్‌ఒ అధికారి అశుతోస్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో విషయంలో దంపతులు ఒకటి కావడంతో కేసు నమోదు చేయలేదని పోలీస్ అధికారి అశుతోష్ వెల్లడించారు. భార్య పోలీస్ అధికారి మాటాలను ఖండించిడంతో పోలీస్ ఉన్నతాధికారులు అధికారులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. నిందితుడికి అండగా నిలిచిన పోలీస్ అధికారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఉన్నతాధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News