Wednesday, January 22, 2025

చికెన్ కూర రుచి… కుమారుడి ప్రాణం తీసిన తండ్రి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: చికెన్ కూర రుచిగా వండలేదని అడిగినందుకు కుమారుడిని తండ్రి కొట్టి చంపిన సంఘటన కర్నాటక రాష్ట్రం దక్షిణా కన్నడ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. షీనా అనే వ్యక్తి తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి సల్లు తాలూకాలోని గుట్టిగర్ ప్రాంతంలో ఉంటున్నాడు. చికెన్ కర్రీని శివరామ్ (32) తండ్రి షీనా వండాడు. భోజనం చేసేటప్పుడు చికెన్ కర్రీ రుచిగా వండలేదని శివరామ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో తండ్రి కుమారుడి మధ్య గొడవ జరిగింది. ఓ కర్ర తీసుకొని శివరామ్ తలపై తండ్రి బాదాడు. తలకు బలమైన గాయాలు కావడంతో తండ్రి ఘటనా స్థలంలోనే చనిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి తన తండ్రిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News