Sunday, January 19, 2025

కూతుళ్ల కోసం లింగమార్పిడి చేసుకొని తల్లిగా మారిన తండ్రి

- Advertisement -
- Advertisement -

 

ఇంటర్‌నెట్ డెస్క్: కన్నతండ్రి కూతుళ్ల కోసం లింగమార్పిడి చేసుకొని తల్లిగా మారిన సంఘటన ఈక్వెడార్‌లో జరిగింది. రీనీ సెలినాస్ రామోస్ అనే (45) వ్యక్తి భార్యతో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్నాడు. దీంతో కూతుళ్ల సంరక్షణ బాధ్యతలను అతడి భార్యకు కోర్టు అప్పగించింది. దీంతో రామోస్ ఐదు నెలల నుంచి కూతుళ్లను కలువలేకపోవడంతో బాధపడుతున్నాడు. తన భార్య సంరక్షణలో కూతుళ్లు చెడు మార్గంలో ప్రయాణించే అవకాశం ఉండడంతో కోర్టు మెట్లు ఎక్కాడు. తన కూతుళ్ల కోసం లింగమార్పిడి చేసుకొని తల్లిగా మారుతానని కోర్టులో విన్నవించాడు. కోర్టు అంగీకారం తెలపడంతో లింగమార్పిడి చేసుకొని తల్లిగా మారాడు. తన గుర్తింపు కార్డుపై ఫెమినినోగా మార్చుకున్నట్టుగా తెలిపాడు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కూతుళ్ల కోసం తల్లిగా మారిన తండ్రిని నెటిజన్లు కొందరు ప్రశంసిస్తుండగా కొందరు విమర్శలు చేస్తున్నారు. న్యాయస్థానాలు ఆలోచన చేసి తండ్రికి కూతుళ్లను అప్పగిస్తే బాగుండని కామెంట్లు పెడుతున్నారు. కన్నతండ్రి చేసిన ఆలోచన గొప్పదని కితాభిస్తున్నారు. తండ్రి తల్లిగా మారిన సంఘటనపై ట్రాన్స్‌జెండర్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News