Monday, December 23, 2024

ఫోన్ మాట్లాడుతుందని కూతురిని భవనం పైనుంచి తోసేసిన తండ్రి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎప్పుడు చూసిన ఫోన్‌లో మాట్లాడుతుందని కూతురిని తండ్రి భవనం పైనుంచి కిందకు తోసేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ గ్రామంలో విద్యార్థిని(16) ఫోన్ మాట్లాడుతుండగా పలుమార్లు తండ్రి హెచ్చరించాడు. దీంతో తండ్రికి తెలియకుండా ఫోన్ మాట్లాడుతుంది. ఇంట్లో ఫోన్ మాట్లాడితే తండ్రి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడని, భవనం పైకి ఎక్కి ఫోన్ మాట్లాడుతుండగా తండ్రి గమనించాడు. వెంటనే భవనం పైకి వెళ్లి కూతురిని ఫోన్ ఎందుకు మాట్లాడుతున్నావని ప్రశ్నించాడు. ఆమె సరైన సమాధానం చెప్పకపోవడంతో గొంతు పట్టుకొని కిందకు తోసేశాడు. కూతురు తీవ్రంగా గాయపడడంతో తల్లి వెంటనే ఆస్పత్రికి తరలించింది. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని ఎస్‌ఐ రాంబాబు తెలిపాడు. తండ్రిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News