Monday, December 23, 2024

చిన్నారిపై కన్నతండ్రే లైంగిక దాడి

- Advertisement -
- Advertisement -

ఆపై గొంతుకోసి హత్య

Father rape on Daughter

మన తెలంగాణ/సిటీ బ్యూరో : నగరంలో అత్యంత దారుణమైన అ మానవీయ ఘటన చోటు చేసుకుంది. కన్న కూతురైన చిన్నారిపై ఓ దుర్మార్గపు తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడడమే కాకుండా గొంతు కోసి అతి కిరాతకంగా హత్య చేశాడు. విషయమంతా తెలిసిన చిన్నారి కన్నతల్లి నీచుడైన భర్తను చీల్చి చెండాల్సింది పోయి సహకరించింది. హైదరాబాద్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకో గా, గుట్టు చప్పుడు కాకుండా చిన్నారి మృతదేహాన్ని తమ స్వగ్రామంలో పాతిపెట్టేందుకు భార్యభర్తలు గుజరాత్‌లోని సొంత గ్రామానికి బయలుదేరి వెళ్లారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకుని అ క్కడి నుంచి గుజరాత్ వెళ్లే రాజ్‌కోట్ బౌండ్ ఎక్స్‌ప్రెస్‌ను ఎక్కారు. అయితే రైళ్లో ప్రయాణిస్తున్న క్రమంలో వారి కదలికల పట్ల తోటి ప్ర యాణికులకు అనుమానం రావడం, చిన్నారి సైతం ఏలాంటి చల నం లేకుండా పడి ఉండడంతో సందేహం కలిగింది. అయితే అప్పటికే రైలు మహారాష్ట్రలోకి ప్రవేశించడంతో సోలాపూర్ రైల్వే టిసి, ప్రయాణికులు కలిసి సోలాపూర్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రైల్వే పోలీసులు సమీపంలోని స్టేషన్‌కు చే రుకుని నిందుతులను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిర్వహించడంతో చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడడమే కాకుండా గొంతు కోసి హత్య చేసినట్లు నిర్థారణ అయినట్లు సోలాపూర్ రైల్వే అదనపు ఎస్‌పి గణే ష్ షిండే వెల్లడించారు. నిందితులను విచారించడంతో నిజం ఒప్పుకున్నారని వారిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News