నల్లగొండ: కూతురు కాపాడిల్సిన తండ్రి ఆమె పాలిట కామాంధుడిలా మారాడు. ప్రతి రోజు వేధిస్తూ ఆమెపై పలుమార్లు అత్యాచారం చేయడంతో ఆమె గర్భవతి కావడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలో ఓ గ్రామానికి చెందిన వ్యక్తి కూతురు రెసిడెన్షియల్ స్కూళ్లో తొమ్మిదో తరగతి చదువుతోంది. కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో స్కూళ్లు మూతపడడంతో ఇంటి దగ్గర ఉంటుంది. కన్నకూతురుపై కామాంధుడి కళ్లు పడ్డాయి. ఆమెను బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారం చేశాడు. కూతురు అనారోగ్యానికి గురికావడంతో దేవరకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. బాలికకు వైద్య పరీక్షలు చేయగా ఆమె గర్భవతి అని వైద్యులు చెప్పడంతో ఇంటికి వచ్చిన తరువాత కూతురును తల్లి నిలదీయడంతో అసలు నిజం చెప్పింది. బయట ఎవరికి చెప్పొద్దని తల్లీ కూతురును శనివారం రాత్రి ఇంట్లో బంధించి వారిపై దాడి చేశాడు. తండ్రి దెబ్బలు తాళలేక కూతురు పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఇద్దరిని రిమాండ్కు తరలించారు.
నల్లగొండలో కూతురుపై లైంగిక దాడి
- Advertisement -
- Advertisement -
- Advertisement -