Wednesday, November 13, 2024

తల్లి ఇంట్లో లేనప్పుడు కూతురుపై అత్యాచారం…

- Advertisement -
- Advertisement -

Father rape on step daughter in hyd

 

హైదరాబాద్: మహిళతో సహజీవనం చేస్తూ ఆమె కూతురుపై కన్నేసి లైంగిక దాడి పాల్పడిన సంఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మహబూబాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో ఓ మహిళకు ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత భర్త విడిపోయి ఒంటరిగా ఉంటుంది. అదే జిల్లాకు చెందిన బేతమాల కృష్ణ(35) పరిచయం కావడంతో అతడితో ఆమె సన్నిహితంగా ఉంది. కుటుంబానికి ఆసరాగా ఉండి పిల్లలను పోషించే బాధ్యత తానే తీసుకుంటానని కృష్ణ మాయమాటలు చెప్పడంతో అతడి సదరు మహిళ సహజీవనం చేస్తోంది.  హైదరాబాద్‌లోని బంజారాహిల్స రోడ్ నంబర్ 14 సమీపంలోని ఓ ఇంట్లో ఉంటున్నారు. బోనాల పండుగ నేపథ్యంలో మహిళ తన తల్లి ఇంటికి కూతురును పంపించింది. అక్కడ నుంచి తిరిగి వచ్చిన తరువాత కూతురు దిగాలుగా ఉండడంతో కుమార్తెను నిలదీసింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో కూతురుపై తండ్రి అత్యాచారం చేశాడని తన తల్లికి తెలిపింది. కృష్ణను ఆమె నిలదీయడంతో అక్కడ నుంచి అతడు పారిపోయాడు. వెంటనే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News