Saturday, April 5, 2025

పరువు తీసిందని కూతురు గొంతు కోసిన తండ్రి

- Advertisement -
- Advertisement -

లక్నో: కూతురు ప్రేమ వ్యవహారం బయటపడడంతో కుటుంబం పరువుపోతుందని తండ్రి తన కూతురు గొంతో కోసి హత్య చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ముజఫర్‌నగర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ధర్మపాల్‌కు ప్రియాన్షి అనే కూతురు ఉంది. తన కులానికి చెందిన యువకుడితో ప్రియాన్షి ప్రేమ వ్యవహారం నడిపించడంతో పలుమార్లు తండ్రి మందలించాడు. తన కుటుంబం పరువు తీస్తుందని కూతురుపై తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో కత్తి తీసుకొని కూతురు గొంతు కోశాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News