Sunday, December 22, 2024

18 రోజుల శిశువును రూ.లక్షకు అమ్మేసిన కన్న తండ్రి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. ఓ తండ్రి డబ్బు కోసం రోజుల వయసున్న కన్న కూతురినే వేరే వారికి విక్రయించాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. నగరంలో పాతబస్తీ బండ్లగూడా పోలీస్ స్టేషన్ పరిధిలోని మొహమ్మద్ నగర్ ప్రాంతంలో అసిఫ్, అస్మా దంపతులు నివసిస్తున్నారు. అసిఫ్ తన భార్య అస్మాను బెదిరించి వారి 18 రోజుల పాపను అమ్మేందుకు సిద్ధమ య్యాడు. ఈ క్రమంలో కర్ణాటకకు చెందిన మినాల్ సాద్ అనే వ్యక్తికి రూ.లక్షకు చాంద్ సుల్తానా అనే మహిళ ద్వారా విక్రయించాడు.

దీనిపై పాప తల్లి అస్మా బండ్లగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 24 గంటల్లోపే శిశువును కర్ణాటక రాష్ట్రానికి వెళ్లి రక్షించి క్షేమంగా తల్లికి అప్పగించారు. దీంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అస్మా, ఆమె కుటుంబ సభ్యు లు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. అటు, ఈ కేసుకు సంబంధించి పాప తండ్రి అసిఫ్, మధ్యవర్తి చాంద్ సుల్తాన్, చిన్నారిని కొన్న మినాల్ సాద్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News