Wednesday, January 22, 2025

పార్కింగ్ వివాదంలో తండ్రి కొడుకులపై కాల్పులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఈశ్యాన్య ఢిల్లీలో పార్కింగ్ వివాదం కాల్పులకు దారితీసింది. కారు పార్కింగ్ విషయమై యమునా విహార్‌లో ఓవ్యక్తి అతడి కుమారుడిపై కొంతమంది వ్యక్తులు కాల్పులుకు పాల్పడ్డారని పోలీసులు శుక్రవారం తెలిపారు.వీరేంద్ర అగర్వాల్‌కు ఛాతీలో బుల్లెట్ గాయమవగా కుమారుడు సచిన్ అగర్వాల్‌కు చేతిపై గాయమైందని పోలీసులు వివరించారు. బాధితులను స్థానికులు తరలించడంతో ప్రాణాపాయం తప్పిందని సీనియర్ పోలీస్ అధికారితెలిపారు.

గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత వివాహ వేడుకల నుంచి బాధితులు ఇంటికి రాగా పొరుగింటి వ్యక్తి ఆరీఫ్ తన కారును రోడ్డుపై నిలిపి ఉంచాడు. దీంతో వివాదం తలెత్తింది. కొంత సేపటికి కొంతమంది వ్యక్తులతో అగర్వాల్ ఇంటికి వచ్చి వారిపై కాల్పులు జరిపాడు. పది నుంచి పదిహేను రౌండ్లు కాల్పులు జరిపారని అగర్వాల్ మరో కుమారుడు అగర్వాల్ తెలిపాడు. నిందితుల్లో ఒకరిని స్థానికులు పట్టుకున్నారని దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News