Sunday, December 22, 2024

వాడు కన్న తండ్రా… కర్కోటకుడా?

- Advertisement -
- Advertisement -

కూతురు స్నేహితుడితో ఫోన్లో మాట్లాడటం సహించలేకపోయాడొక కన్న తండ్రి. ఆమెకు మాయ మాటలు చెప్పి,  తీసుకువెళ్లి యమునా నదిలోకి తోసేశాడు. ఈ సంఘటనలో తండ్రికి బాలిక మేనమామ సహకరించడం విశేషం.

ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ కు చెందిన పదహారేళ్ల బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆమె ఇటీవల ఏదో విషయమై తన స్నేహితుడితో ఫోన్లో మాట్లాడుతుంటే తండ్రి గమనించాడు. అప్పటికి ఊరుకుని, ఆ మర్నాడు గురుగ్రామ్ వెళ్దాం రమ్మని కూతురిని వెంటబెట్టుకుని బయల్దేరాడు. దారిలో యమునా నదిపై వంతెన వద్ద బాలిక మేనమామ కలిశాడు. ఇద్దరూ కలసి మఫ్లర్ తో బాలిక మెడకు ఉరి బిగించి, వంతెనపైనుంచి నదిలోకి తోసేసి పారిపోయారు.

అయితే బాలిక కేకలు విన్న సమీప గ్రామస్థులు వెంటనే నీళ్లలోకి దూకి, ఆమెను కాపాడారు. పోలీసులు రంగంలోకి దిగి ఆమెను బాలిక సంరక్షణ శరణాలయానికి తరలించారు. నిందితులకోసం గాలింపు జరుపుతున్నామని ఫతేబాద్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ గిరీశ్ కుమార్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News