Saturday, April 5, 2025

ఖైరతాబాద్ లో విషాదం.. కూతురి మృతిని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తన కూతురి మృతిని తట్టుకోలేక ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదం ఘటన నగరంలోని ఖైరతాబాద్ లో చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అయితే, తన కూతురు ఇకలేదని తీవ్ర మనోవేదనకు గురైన చిన్నారి తండ్రి కిశోర్, ఖైరతాబాద్ లో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకుని వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానాకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News