Wednesday, January 22, 2025

ప్రేమోన్మాదానికి కూతురు, తండ్రి బలి

- Advertisement -
- Advertisement -

Father suicide over daughter killed

మన తెలంగాణ/చెన్నై: యువతి ప్రేమించలేదని ఓ ప్రేమోన్మాది రైలు ముందు తోసేసి చంపాడు… కన్న కూతురు మరణం తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని ఆదంబాక్కం రాజా వీధి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మాణిక్యం, రామ లక్ష్మి అనే దంపతులు ఆదిభాక్కం పోలీస్ స్టేషన్ క్వార్టర్స్‌లో నివసిస్తున్నారు. రామలక్ష్మి అదే పోలీస్ స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తుంది. ఈ దంపతుల కుమార్తె సత్య స్థానికంగా ఉండి డిగ్రీ చదువుతోంది. అదే ప్రాంతంలో ఉండే రిటైర్డ్ ఎస్‌ఐ దయాళన్ కుమరుడు సతీష్ ప్రేమించాలని సత్యను వేధించేవాడు. సతీష్ అంటే తనక ఇష్టం లేదని పలుమార్లు అతడికి చెప్పింది. అయనా కూడా అతడు వెంటపడ్డాడు. కాలేజీకి వెళ్లేందుకు ఆమె సెయింట్ థామస్ మౌంట్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారం పై నిల్చొని ఉంది. సతీష్ అక్కడికి వచ్చి ఆమెతో గొడవకు దిగాడు. ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో ఆమెను రైలు ముందు తోసేశాడు. దీంతో ఆమె ఘటనా స్థలంలోనే చనిపోయింది. కుమార్తె చనిపోయిందని వార్త వినగానే తండ్రి మాణిక్యం మద్యంలో విషంలో కలుపుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక ఇంట్లో ఇద్దరు చనిపోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News