Thursday, January 23, 2025

మహబూబాబాద్ లో దారుణం..

- Advertisement -
- Advertisement -

Father throws his kids into well in Mahabubabad

మహబూబాబాద్: జిల్లాలో ఓ కసాయి తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం గడ్డిగూడెం తండాలో కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలను బావిలో పడేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో ఇద్దరు పిల్లలు అమి జాక్సన్(8), జానిబెస్టో(6)లు మృతి చెందారు. పిల్లల మృతదేహాలను బయటికి తీసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఘటనకు గల కారణాలను బాధిత కుటుంబాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. నిందితుడు సిఆర్పిఎఫ్ జవాన్ రామ్ కుమార్ గా గుర్తించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Father throws his kids into well in Mahabubabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News