Thursday, January 23, 2025

భవనంపై నుంచి కొడుకును విసిరేసిన తండ్రి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ కల్కాజీ లో భార్యతో గొడవపడిన భర్త కోపంతో తన మూడేళ్ల కొడుకుని భవనం మొదటి అంతస్థు నుంచి తోసివేయడమే కాక, మూడో అంతస్థు నుంచి తాను కూడా దూకేశాడు. శుక్రవారం ఈ సంఘటన జరిగింది. తండ్రీ కొడుకుల పరిస్థితి క్లిష్టంగా ఉంది. ఢిల్లీ పోలీసుల కథనం ప్రకారం ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తి 30 ఏళ్ల మన్‌సింగ్‌గా గుర్తించారు. ఢిల్లీ కల్కాజీలో అమ్మమ్మ వద్ద ఉంటున్న భార్య వద్దకు వచ్చి గొడవపడ్డాడు. దీంతో కోపగించుకుని తన మూడేళ్ల కొడుకుని మొదటి అంతస్థు నుంచి తోసేశాడు.

ఆ పిల్లవాడిని హోలీ ఫ్యామిలీ ఆస్పత్రిలో చేర్పించగా, మన్‌సింగ్‌ను తక్షణమే ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించారు. సింగ్ భార్య పూజా భర్తతో తనకు సత్సంబంధాలు లేవని, అమ్మమ్మ వద్దనే కొన్నాళ్లుగా తన ఇద్దరి పిల్లలతో ఉంటున్నానని చెప్పింది. శుక్రవారం రాత్రి ఆరు, ఏడు గంటల సమయంలో తన భర్త తప్పతాగి వచ్చి గొడవ పడ్డాడని, అకస్మాత్తుగా తన కొడుకును భవనం మొదటి అంతస్థు నుంచి తోసివేశాడని తెలిపింది. తరువాత తాను కూడా మూడో అంతస్థు నుంచి దూకేశాడని పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News