Wednesday, January 22, 2025

బావిలో పేగుబంధం

- Advertisement -
- Advertisement -

Father who pushed his children into well and killed them

ఇద్దరు కన్నబిడ్డలను బావిలో తోసి హతమార్చిన తండ్రి, అనంతరం
రైలు కింద పడి ఆత్మహత్య
మహబూబాబాద్ జిల్లా గడ్డిగూడెంలో
సిఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ దారుణం
అప్పులపై భార్య నిలదీస్తున్నందకు ఘాతుకం

మన తెలంగాణ/ మహబూబాబాద్ ప్రతినిధి : ఆర్థిక సమస్యలు, ఆపై భార్య భర్తల మధ్య గొడవతో.. అభం శుభం తెలియని కన్న బిడ్డల్ని వ్యవసాయ బావిలో తోసి హత్య చేసి ఆపై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడో తండ్రి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ మండలం గడ్డిగూడెంలో మంగళవారం ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇందుకు సంబందించి వివరాల్లోకి వెళితే.. మండలంలోని గడ్డిగూడెం గ్రామానికి చెందిన భూక్యా రాంకుమార్, అదే తండాకు చెందిన శిరీషను పదేళ్ళ క్రితం ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. సిఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌గా ముంబాయిలో పనిచేస్తూ కుటుంబంతో అక్కడే ఉంటున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు. కుమార్తె ఆమీ జాక్సన్ (9), కుమారుడు జానీ బెస్ట్ (6). సంక్రాంతి సెలవుల కారణంగా నాలుగు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చారు. రాం కుమార్ ఏడాది కాలంగా ఇంటి ఖర్చులకు సరిగ్గా డబ్బులు ఇవ్వకపోవడం, భార్య శిరీషకు చెందిన బంగారు నగలను తాకట్టు పెట్టడంతో దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయంలో శిరీష భర్తను నిలదీయడంతో తన బ్యాంకు ఖాతా బ్లాక్ ఆయ్యిందని దాటవేస్తువస్తున్నాడు.

ఈ విషయంలో శిరీష.. రాంకుమార్ మాటలను నమ్మక రహస్యంగా విచారించింది. రాంకుమార్ బ్యాంకులో రూ.15 లక్షల రుణం తీసుకున్నట్లు తెలుసుకుంది. దీంతో ఆయనకు వచ్చే జీతంలో ఎక్కువ భాగం నెలవారీ బ్యాంకు లోన్‌గా కట్ అవుతుందని తెలుసుకుని.. అంత డబ్బు ఏం చేశావని భర్తను నిలదీయడంతో కొంతకాలంగా వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. కాగా, మంగళవారం కూడా ఇంట్లో భార్యభర్తలు ఘర్షణ పడ్డారు. ఈ సందర్భంలో శిరీషపై రాం కుమార్ చేయి చేసుకోగా ఆమె ఏడుస్తూ గ్రామంలోనే ఉన్న పుట్టింటికి వెళ్లి తన గోడును తండ్రి వద్ద మొరబెట్టుకుంది. దీనిపై శిరీష తండ్రి అల్లుడిని నిలదీశాడు. వారి మధ్య మాట మాట పెరిగి కొద్దిసేపటికి ఇంట్లోకి వెళ్లిన రాంకుమార్ నిద్రపోతున్న పిల్లలిద్దర్ని లేపి ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్దకు తీసుకువెళ్లాడు.

పిల్లలిద్దరిని బావిలో తోసేసి హత్య చేశాడు. సమీపంలో ఉన్న రైతులు ఈ ఘటనను చూసి బావిలో మునిగిపోతున్న పిల్లలిద్దర్ని బయటకు తీయగా.. అప్పటికే చిన్నారులు కన్నుముశారు. కాగా, అక్కడ నుంచి రాంకుమార్ సమీపంలోని అనంతారం రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మ చేసుకున్నాడు. ఒక పక్క పిల్లలు, మరో వంక కట్టుకున్న భర్త మృతి చెందడంతో శిరీష, కుటుంబసభ్యుల రోదనలతో ఆ ప్రాంతం దద్ధరిల్లిపోయింది. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ సుంకరి రవికుమార్, ఎస్సై అరుణ్‌కుమార్ తమ సిబ్బందితో సంఘటనా స్థలికి చేరుకుని పిల్లల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News