Friday, November 22, 2024

చౌరస్తాల్లో.. ఫాల్ట్ పాసేజ్ ఇండికేటర్లు

- Advertisement -
- Advertisement -

fault passage indicators in Telugu

– విద్యుత్ అంతరాయాలకు చెక్

హైదరాబాద్: నగరంలో జంపర్ కట్‌లు, రెండు తీగలు కలుసుకోవడం, భూగర్భ కేబుల్ సమస్యలు, చెట్ల కొమ్మలు తీగలపై పడటం, ఇన్సులేషన్ పిన్ పోవడం, వంటి కారణాలతో లైన్లు ట్రిప్పు అవుతుంటాయి. బ్రేక్ డౌన్ల సమస్యలు వస్తుంటాయి. వీటిమీద వినియోగదారులు ఎవరైనా ఫిర్యాదులు చేస్తే చాలా సందర్భాల్లో అంతరాయలు ఏర్పడిన సంగతి తెలియదు. సమాచారం అందుకున్నాక ఎక్కడ సమస్య ఏర్పడిందో గుర్తించేందుకు సిబ్బంది చాలా శ్రమిం చాల్సి వస్తోంది. తమ పరిధిలో 3 కిలో మీటర్లు పోడువునా తీగలు తనిఖీ చేసుకుంటూ వెళుతున్నారు. బయటకు కనిపి ంచే ఏ సమస్య అయితేసరి. లేకపోతే ఆ విధంగా సమస్య ఎక్క డ నుంచి ఉత్పన్నం అవుతుందో తెలుసుకోవాలంటే అలా వెళు తూ వెళ్ళాల్సిందే దీంతో సమయం వృథా, అవుతోంది. దీంతో ఆ సమస్యను పరిష్కరిచేందుకు రెండు నుంచి మూడు గంటలు సమయం కూడా పడుతోంది. నగరంలో తరచు అంతరా యాలు ఏర్పడే ప్రాంతాల్లో సిబ్బంది వారికున్న అనుభవంతో ఫలానా కారణాలతో, ఫలానా ప్రాంతంలో సమస్య ఉందనే అంచనాతో వారు రంగంలోకి దిగుతున్నారు. ఆ మేరకు కొన్నింటిని వారు పరిష్కరిస్తున్నారు.

ఇది అధికారులు బదిలీ అయినప్పుడు, సిబ్బంది కొత్తవారు వచ్చినప్పుడు అంతరాయాల్లో పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతుందనే ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. వారు ఆయా ప్రాంతానికి కొత్తవారు కావడం, సమస్య ఎక్కడ ఉందో తెలియక పొవడం ప్రధాన కారణం అని అధికారులు అంటున్నారు. శాస్త్రీయంగా లోపాలను గుర్తించే వ్యవస్థ గుర్తించేందుకు ఫీడర్ కూడలిలో ఫాల్ట్ మేసేజ్ ఇండికేటర్లను బిగిస్తున్నారు. వీటితో ఆయా సమస్యలు పరిష్కారం సులువు అవుతుంది. హైదరాబాద్ సెంట్రల్, నార్త్, సౌత్ సర్కిళ్ళ పరిధిలో ప్రయోగాత్మకంగా 150కి పైగా ఫీడర్లలో ఇండికేటర్లను ఏర్పాటు చేశారు. హెచ్‌టి వినియోగదారు లు అత్యధికంగా ఉన్న హైదరాబాద్ ఉత్తర సర్కిల్లో వందకు పైగా ఫీడర్లలో వీటిని ఏర్పాటు చేశారు.

పరిపాలన పరంగా కీలకమైన హైదరాబాద్ మధ్య, సర్కిల్, హైదరాబాద్ దక్షిణ సర్కిల్‌ల్లో ఎంపిక చేసిన ఫీడర్లలో మిగిలిన వాటిని ఏర్పాటు చేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడితే స్కాడా కేంద్రంలోని కంప్యూటర్ తెరపై ఆయా సమస్య స్పష్టంగా తెలుస్తుంది. క్షేత్ర స్థాయి ఇంజనీర్లు తమ సిస్టంలో వీటిని చూసుకుని మరమ్మత్తులు పూర్తిచేసి సరఫరా పునరుద్ధ్దరింప చేయవచ్చు. సమస్య ఉన్న ప్రాంతం వరకు విద్యుత్ సరఫరా నిలిపివేసి మిగతా ప్రాంతంలో విద్యుత్ సరఫరా ఇచ్చేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది, స్కాడా డీఎంఎస్‌లో భాగంగా దీన్ని చేపడుతున్నారు. ఫాల్ట్ పాసేజ్ ఇండికేటర్ల ఏర్పాటుతో ఫీడర్ స్థాయిని ఐటిని విస్తరింప చేస్తున్నారు. ఫలితంగా అంతయాలు సత్వర పరిష్కారంతో పాటు నిర్వహణ మరింత మెరుగుతుందని అధికారులు అంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News