Friday, November 15, 2024

ఫాస్ట్ కాన్

- Advertisement -
- Advertisement -
నెలక్రితం ఫాక్స్‌కాన్ కంపెనీకి భూమిపూజ
శరవేగంగా కొనసాగుతున్న పనులు
ట్విట్టర్‌లో ఫాక్స్‌కాన్ ప్లాంట్ నిర్మాణ పనులకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన మంత్రి కెటిఆర్
యంగ్ లియు బృందం కూడా తెలంగాణ లాగే స్పీడ్ మీద ఉందని మంత్రి వ్యాఖ్య

మనతెలంగాణ/హైదరాబాద్ : నెల రో జుల క్రితం భూమిపూజ చేసుకున్న ఫా క్స్‌కాన్ కంపెనీ పనుల్లో పురోగతి ఏ స్థా యిలో ఉందో చూడండి అంటూ రాష్ట్ర ఐ టి, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు ట్వీట్ చేశారు. ఫాక్స్‌కాన్ ప్లాంట్ నిర్మాణ పనులకు సంబంధించిన వీడియోను కెటిఆర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. నెలరోజుల క్రితం రంగారెడ్డి జిల్లా కొం గర్ కలాన్‌లో ఫాక్స్ కాన్ ప్లాంట్‌కి భూ మిపూజ జరిగిన విషయాన్ని మంత్రి గు ర్తు చేశారు. ఇంత తక్కువ వ్యవధిలో ఇం త స్పీడ్‌గా పనులు మొదలుపెట్టడం పట్ల కెటిఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లియు గతంలో చేసిన వ్యాఖ్యల్ని మంత్రి కెటిఆర్ గుర్తు చేశారు.

గతంలో రాయుదుర్గ ఐటీ కారిడార్‌లో 18 ఎకరాల్లో అ త్యాధునిక స్దుపాయాల్తో టీ వర్క్‌ను ప్రా రంభించుకున్న సందర్భంలో యంగ్ లియు ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ లో జరిగిన అభివృద్ధి చాలా అద్భుతమని యంగ్ లియు వ్యాఖ్యానించారు. రాబో యే నాలుగేళ్లలో తెలంగాణ ఆదాయం రె ట్టింపు అవుతుందని చెప్పారు. తెలంగా ణ మంచి స్పిరిట్ ఉన్న రాష్ట్రం అని, టి- వర్క్‌లోనే కాదు మిగతా రంగాల్లో కూ డా డెవలప్‌మెంట్ ఉందన్నారు. అభివృద్ధిలో తెలంగాణ స్పీడ్ తనకు బాగా న చ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రం అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుందని ప్రశంసించారు. ఆయన వ్యాఖ్యల్ని గుర్తు చేస్తూ.. తెలంగాణ స్పీడ్ గురించి తెలిసిందే, అ యితే తెలంగాణ లాగే యంగ్ లియు బృందం కూడా మంచి స్పీడ్ మీద ఉంది అని కెటిఆర్ ట్విట్టర్‌లో ప్రశంసించారు.

శరవేగంగా పనులు
ఫాక్స్‌కాన్ కంపెనీ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగర కలాన్‌లో సుమారు రూ.1,656 కోట్ల(200 మిలియన్ డాలర్లు) పెట్టుబడితో తయారీ యూనిట్ నెలకొల్పుతోంది. టిఎస్‌ఐఐసి కి చెందిన 200 ఎకరాల్లో ఈ కంపెనీ ఏ ర్పాటవుతుండగా,ప్రస్తుతం అక్కడ ప ను లు శరవేగంగా సాగుతున్నాయి.ఈ ప్లాం ట్ అందుబాటులోకి వస్తే ప్రత్యక్షం గా 35 వేల మందికి, పరోక్షంగా మరో 30 వేల మందికి ఉపాధి లభిస్తుందని అం చనా. మే నెలలో ఫాక్స్‌కాన్ కంపెనీకి మంత్రి కెటిఆర్ భూమిపూజ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News