Sunday, January 19, 2025

సిబిఐ డైరెక్టర్‌తో ఎఫ్‌బిఐ డైరెక్టర్ భేటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఎఫ్‌బిఐ) డైరెక్టర్ క్రిస్టఫర్ వ్రే సోమవారం నాడిక్కడ సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌తో సమావేశమయ్యారు. సైబర్ ఆర్థిక నేరాలతోపాటు ఇతర అంశాలలో సహకారం పెంపొందించుకోవడంపై వారిద్దరు చర్చించినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఇతర పీరిమకః అధికెలతొ లపి ఎఫ్‌బిఐ డైరెక్టర్ సిబిఐ కార్యాలయానికి చేరుకున్నారు. రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం వ్రే ఆదివారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు.

భారతీయ భద్రత, అత్యున్నత దర్యాప్తు సంస్థల అధికారులతో ఎఫ్‌ఐబి డైరెక్టర్ చర్చలు జరపనున్నట్లు అధికారులు తెలిపారు. సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులు, నేరస్థుల అప్పగింతకు సంబంధించిన న్యాయపరమైన అభ్యర్థనలు తదితర అంశాలు సిబిఐ డైరెక్టర్‌తో జరిగిన చర్చలలో ప్రస్తావనకు రావచ్చని అధికారులు పేర్కొన్నారు. అమెరికన్ గడ్డపై సిక్కు వేర్పాటువాది గుర్‌పట్వంత్ సింగ్ పన్నున్ హత్యకు జరిగిన కుట్రలో భారతదేశ ప్రమేయంపై అమెరికా ఆరోపణలు చేసిన నేపథ్యంలో వీరి మధ్య చర్చలు జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News