Monday, December 23, 2024

ట్రంప్ ఇంట్లో ఎఫ్‌బిఐ సోదాలు

- Advertisement -
- Advertisement -

ఫ్లోరిడాలోని ఎస్టేట్‌లో తనిఖీలు దేశ రహస్య పత్రాల కోసం
అన్వేషణ ధ్రువీకరించిన ట్రంప్ కుమారుడు
ఇంటి నుంచి 15 బాక్సుల్లోని పత్రాలు స్వాధీనం

ఫ్లోరిడా : ఫ్లోరిడాలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన మార్‌ఎలాగో ఎస్టేట్‌లో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బిఐ) సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దేశ రహస్య పత్రాలను ఇక్కడికి తరలించారేమో అన్న అనుమానంతో సోదాలు చేశారు. అయితే వీటిని అధికారులు ధ్రువీకరించక పో యినా ట్రంప్ ఆయన కుటుంబ సభ్యులు మాత్రం అంగీకరించారు. అమెరికా మాజీ అధ్యక్షుడి ఇల్లు సీక్రెట్ సర్వీస్ సిబ్బంది రక్షణలో ఉంటుంది. తనిఖీలకు కొద్దిసేపటి ముందు సోమవారం ఎఫ్‌బిఐ సిబ్బంది…సీక్రెట్ సర్వీస్ అధికారులకు వారెంట్ విషయం వెల్లడించారు. దీంతో వారు వారెంట్లను పరిశీలించి అనుమతించారు.

దీనిపై ట్రంప్ కుమారుడు ఎరి క్ ఓ ఆంగ్ల వార్తా సంస్థతో మాట్లాడుతూ 30 మంది సిబ్బంది శ్వేతసౌధం నుంచి ట్రంప్‌పై దాడికి వచ్చారనివ్యాఖ్యానించారు. చాలా రోజుల నుంచి ట్రంప్ ఈ దర్యాప్తుకు సహకరిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ట్రంప్ ఇంటి నుంచి 15 బాక్సుల్లో పత్రాలు దొరికినట్టు వచ్చిన వార్తపై ఎరిక్ స్పందిస్తూ శ్వేతసౌధం ఖాళీ చేసేందుకు కేవలం ఆరు గంటల సమయం మాత్రమే ఉంటుందన్నారు. ఆ సమయంలో ట్రంప్ వద్ద ఉన్న క్లిప్పింగ్‌లను భద్రపరిచారని, అవే ఆ పెట్టెలని పేర్కొన్నారు. ఈ దాడులపై ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. మార్ ఎలాగో ఎస్టేట్‌లను ఎఫ్‌బిఐ ఏజెం ట్లు ఆక్రమించుకున్నారని, ఇది దేశానికి చీకటి రోజని వ్యాఖ్యానించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News