Sunday, December 22, 2024

మూడు బ్యాంకుల్లో ఎఫ్‌డి రేట్లు పెరిగాయ్

- Advertisement -
- Advertisement -

fd interest rate rising in 3 banks

న్యూఢిల్లీ : ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఈ మూడు దిగ్గజ ప్రైవేటురంగ బ్యాంకులు ఎఫ్‌డి(ఫిక్స్‌డ్ డిపాజిట్ల) రేట్లను పెంచాయి. ఐసిఐసిఐ బ్యాం క్ తర్వాత యాక్సిస్ బ్యాంక్ ఎఫ్‌డి వడ్డీ రేట్లను 55 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో కస్టమర్‌లు ఇప్పుడు ఎఫ్‌డిపై ఎక్కువ వడ్డీని పొందుతారు. యాక్సిస్ రూ.2 కోట్ల లోపు ఎఫ్‌డిలపై వడ్డీ రేట్లను బ్యాంక్ పెంచింది. యాక్సిస్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, కొత్త వడ్డీ రేట్లు అక్టోబర్ 1 నుండి అమలులోకి వచ్చాయి. యా క్సిస్ బ్యాంక్‌లో ఎఫ్‌డిపై 2.75% నుండి 6.15% వరకు వడ్డీని పొందుతారు. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా రూ.2 కోట్ల లోపు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచింది. ఐసిఐసిఐ బ్యాంక్ కొత్త వడ్డీ రేట్లు సెప్టెంబర్ 30 నుండి అమలులోకి వ చ్చాయి. ఆర్‌బిఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా) ఇటీవల రెపో రేట్లను 50 బేసిస్ పాయిం ట్లు (బిపిఎస్) పెంచింది. దీంతో రెపో రేటు 5.40% నుంచి 5.90 శాతానికి పెరిగింది. అం టే, హోమ్ లోన్‌ల నుండి ఆటో, పర్సనల్ లో న్‌ల వరకు అన్నీ ఖరీదైనవి అయ్యాయి. ఇప్పు డు మరింత ఇఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News