Sunday, January 12, 2025

జాన్సన్ బేబీ పౌడర్ లైసెన్స్ రద్దు..

- Advertisement -
- Advertisement -

FDA Cancelled Licence of Johnson's Baby Powder

ముంబయి: ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ (ఎఫ్‌డిఎ) ప్రఖ్యాత బేబీ పౌడర్ తయారీ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ లైసెన్స్‌ను రద్దు చేసింది. ముంబయిలోని కంపెనీకి చెందిన ములుండ్ ప్లాంట్‌పై ఎఫ్‌డిఎ చర్యలు తీసుకుంది. పుణె, నాసిక్‌లో జాన్సన్ అండ్ జాన్సన్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ ఉత్పత్తులు ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నాయి. ముంబయి ప్లాంట్ల నుంచి తయారైన బేబి పౌడర్లు నాణ్యతలేనిదిగా నిర్ధారణ అయిందని ఎఫ్‌డిఎ తెలిపినట్లు ఎఎన్‌ఐ వెల్లడించింది. జాన్సన్ ఉత్పత్తులు నాసిరకంగా ఉండటంతో ప్రజారోగ్య ప్రయోజనాల దృష్టా ఆ కంపెనీకి ఎఫ్‌డిఎ షోకాజ్ జారీ చేసింది. నవజాత శిశువుల చర్మానికి జాన్సన్ బేబీ పౌడర్ హానికలిగించే అవకాశం ఉందని, పౌడర్ శాంపిల్స్‌ను ల్యాబరేటరీలో పరీక్షించగా ప్రామాణిక పిహెచ్ వ్యాల్యూకంటే తక్కువగా ఉందని తేలిందని మహారాష్ట్ర ప్రభుత్వసంస్థ ఎఫ్‌డిఎతెలిపింది.

FDA Cancelled Licence of Johnson’s Baby Powder

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News