Thursday, January 23, 2025

బిజెపి బతుకంతా ఫేక్.. లీక్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ని రాజకీయంగా ఎదురుకొనే దమ్ము లేకనే బిజెపి నేతలు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఎఫ్దీసి చైర్మన్ అనిల్ కూర్మాచలం విమర్శించారు. బిజెపి పార్టీ బతుకంతా ఫేక్ …లీక్ లేనని, తమ స్వార్ధ రాజకీయ అవసరాల కోసం బీజేపీ నాయకులు పేపర్‌ లీక్‌ చేసి విద్యార్థులను, తల్లితండ్రులను, ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని అనిల్ కూర్మాచలం ఆగ్రహం వ్యక్తంచేశారు.

తప్పుచేసి అడ్డంగా దొరికినప్పటికీ బండి సంజయ్‌ని బిజెపి పార్టీ నేతలు వెనకేసుకురావడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రజలంతా గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో వీరికి తగిన బుద్ది చెప్తారని అనిల్ తెలిపారు. ఈ ప్రశ్నపత్రాల లీక్ వెనక ఉన్న వారందరిని కఠినంగా శిక్షించాలని, విద్యార్థులు ఎటువంటి ఆందోళ చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం మీ వెంట ఉందని అనిల్ తెలిపారు. గతంలో విద్యార్థులంతా చదువులు పక్కనపెట్టి తమ వెంట రావాలని పిలుపునిచ్చిన బండి సంజయ్, అదే ప్రణాళికతోనే లీకుల కుట్రకు తెర లేపారని, ఎంపీ గా కొనసాగే అర్హత లేదని అనిల్ విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News