Sunday, January 19, 2025

భయం వద్దు – మహిళల రక్షణ, భధ్రతలో మీకు మేమున్నాం

- Advertisement -
- Advertisement -
  • విద్యార్థినులకు గజ్వేల్ ఎసిపి రమేష్ భరోసా

గజ్వేల్: సిద్దిపేట కమీషనరే ట్ పరిధిలోని గజ్వేల్ పోలీసులు మీ భద్రతకున్నారు. నిర్భయంగా మీ వృత్తి ఉద్యోగాలు చేసుకోవాలని గజ్వేల్ ఎసిపి యం. రమేష్, సిఐ వీర ప్రసాద్‌లు గ జ్వేల్ పరిధిలోని మహిళలు, విద్యార్థినులకు భరో సా ఇచ్చారు. గురువారం గజ్వేల్ పోలీసు స్టేషన్ ఆ వరణలో స్థానిక విద్యాసౌధలో ఉన్న ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్ధినులకు అనేక అం శాలపై అవగాహన కల్పించారు. వాటిలో ము ఖ్యంగా మహిళల రక్షణకు ఉన్న వివిధ చట్టాలు, సైబర్ నేరాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తదితర అంశాలపై వారు వివరించారు. ఈ సందర్భంగా ఎసిపి రమేష్ మాట్లాడుతూ కమ్యునిటీ పోలీసింగ్ లో బాగంగా నిర్వహించే వివిధ కార్యక్రమాలపై క ళాశాలల బాలికలకు అవగాహన కల్పించాలని తమ కమీషనర్ ఇచ్చిన ఆదేశాలతో ఈ కార్యక్రమా న్ని ఏర్పాటు చేశామన్నారు.

జిల్లాలో మహిళల రక్షణకు సిద్దిపేట సిపి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన తెలిపారు. గురువారం నిర్వహించిన అవగాహన సమావేశంలో షీటీమ్ దాని ప్రముఖ్యత, ఆ టీమ్ నిర్వహించే విధుల గురించి క్షుణ్ణంగా వివరించారు. అలాగే మానవ అక్రమ రవాణా, ఫోక్సో చట్టాల గురించి, బాల్య వివాహాలు వాటి వల్ల జరిగే అనర్థాలు, ఈవ్ టీజింగ్,గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తి తర అంశాలపై వివరించారు. సోషల్ మీడియా దాని పరిణామాలు, సైబర్ క్రైమ్,సైబర్ సెక్యూరిటీ, మైనర్స్ డ్రైవింగ్, డయల్ 100 ప్రాముఖ్యత, సహజ రుగ్మతల గురించి సమాజంలో జరుగుతున్న నే రాలు, వాటి నుంచి ఎలా రక్షణ పొందాలనే అంశాలపై కూడా సోదాహరణంగా ఎసిపి, సిఐలు వివరించారు. సెల్ఫ్ కాన్పిడెన్స్, సెల్ఫ్ డిఫెన్స్, డ్రగ్స్, గంజాయి,ఇతర మత్తు పదార్ధాలు వాడకం వల్ల వ్యక్తిగతంగానే కాకుండా కుటుంబాలకు కలిగే న ష్టాలు, ఆన్‌లైన్లో న్యూడ్ కాల్స్ విపరిణామాలను తెలిపారు.

సోషల్ మీడియా వల్ల జరిగే నష్టాలు లాభాలను వివరించారు. గతంలో జరిగిన నేరాలు, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భరోసా సెంటర్లలో ఫోక్సో కేసుల్లో 18 సంవత్సరాల లోపు బాలికలకు అందిస్తున్న సేవల గురించి వివరించారు. మహిళలు గృహ హింసకు , వరకట్న వే ధింంపులు, శారీరకంగా మానసికంగా వేధింపులు, హింసించటం వంటి వాటిపై వివరిస్తూ ఇలాంటి కేసుల్లో చట్టాలు ఎలా ఉంటాయన్న విషయాలను వివరించారు. అపరిచిత వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలి, రోడ్డుపై వెళ్లేటపుడు ఎవరైనా వేధిచినా,అవహేళణ చేసినా వెంటనే డయల్100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. ఇలాంటి సందర్భంలో సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శశికళతో పాటు అధ్యాపకులు,గజ్వేల్ షీటీమ్ ఎఎస్సై అమృత్, హెడ్ కానిస్టేబుల్ సంజీవ రెడ్డి, కానిస్టేబుల్స్ యుగంధర్, అన్వేష్,మహిళా కానిస్టేబల్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News