Thursday, January 9, 2025

వచ్చే సంవత్సరం ఫిబ్రవరి, నవంబర్‌లో అధికంగా శుభ ముహూర్తాలు

- Advertisement -
- Advertisement -

జనవరిలో 09, మార్చిలో 10 రోజులు శుభకార్యాలకు శుభసూచకం

మనతెలంగాణ/హైదరాబాద్:  వచ్చే సంవత్సరం శుభముహూర్తాలు బాగున్నాయని వేదపండితులు పేర్కొంటున్నారు. 2024 సంవత్సరంలో 7 నెలల పాటు శుభ కార్యాలకు అనువుగా ఉన్నాయని వారు తెలిపారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, జూలై, నవంబర్, డిసెంబర్‌లో ఈ శుభ కార్యాలను జరుపుకోవడానికి మంచి ముహూర్తాలు ఉన్నాయని వేదపండితులు పేర్కొన్నారు. జనవరిలో పెళ్లిళ్లు చేయడానికి మంచి ముహూర్తాలు జనవరి 16వ తేదీ (మంగళవారం), జనవరి 17వ తేదీ (బుధవారం), జనవరి 20వ తేదీ (శనివారం), జనవరి 21వ తేదీ (ఆదివారం), జనవరి 22వ తేదీ (సోమవారం), జనవరి 27వ తేదీ (శనివారం), జనవరి 28వ తేదీ (ఆదివారం), జనవరి 30వ తేదీ (మంగళవారం), జనవరి 31వ తేదీ (బుధవారం)తో కలిపి జనవరిలో 9 మంచి రోజులు ఉన్నాయి.
ఫిబ్రవరి 2024లో వసంత ఋతువు ప్రారంభం
ఫిబ్రవరి 2024లో వసంత ఋతువు ప్రారంభం అవుతుంది. ఈ నెలలో కూడా ఎన్నో శుభముహూర్తాలు ఉన్నాయి. మరి ఈ నెలలో పెళ్లిళ్లు చేయడానికి మంచి ముహూర్తాలను చూసుకుంటే…. ఫిబ్రవరి 4వ తేదీ (ఆదివారం), ఫిబ్రవరి 6వ తేదీ (మంగళవారం), ఫిబ్రవరి 7వ తేదీ (బుధవారం), ఫిబ్రవరి 8వ తేదీ (గురువారం), ఫిబ్రవరి 12వ తేదీ (సోమవారం), ఫిబ్రవరి 13వ తేదీ (మంగళవారం), ఫిబ్రవరి 17వ తేదీ (శనివారం), ఫిబ్రవరి 24వ తేదీ (శనివారం), ఫిబ్రవరి 25వ తేదీ (ఆదివారం), ఫిబ్రవరి 26వ తేదీ (సోమవారం), ఫిబ్రవరి 29వ తేదీ (గురువారం)తో కలిపి 11 శుభ ముహూర్తాలు ఉన్నాయి.
మార్చిలో 10 రోజులు ఏప్రిల్‌లో 5 రోజులు
మార్చి 1వ తేదీ (శుక్రవారం), మార్చి 2వ తేదీ, (శనివారం), మార్చి 3వ తేదీ (ఆదివారం), మార్చి 4వ తేదీ (సోమవారం), మార్చి 5వ తేదీ (మంగళవారం), 6వ తేదీ (బుధవారం), 7వ తేదీ (గురువారం), 10వ తేదీ (ఆదివారం), 11వ తేదీ (సోమవారం), 12వ తేదీ (మంగళవారం), ఏప్రిల్ నెలలో 18వ తేదీ (గురువారం), 19వ తేదీ (శుక్రవారం), 20వ తేదీ (శనివారం), 21వ తేదీ (ఆదివారం), 22వ తేదీ (సోమవారం) శుభ ముహూర్తాలు ఉన్నాయి. మార్చిలో 10 రోజులు ఏప్రిల్‌లో 5 రోజులు శుభముహూర్తాలు ఉన్నాయి.
ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ముహూర్తాలు లేదు
ఏప్రిల్‌లో 5 రోజులుండగా రెండు నెలల గ్యాప్ తర్వాత జూలైలోనూ శుభకార్యాలకు అనువుగా ఉందని పండితులు తెలిపారు. వర్షాకాలంలో పెళ్లి చేసుకోవాలంటే జూలైలో ఏదైనా తేదీని ఫిక్స్ చేసుకోవచ్చు. జూలై 9వ తేదీ (మంగళవారం), జూలై 11వ తేదీ (గురువారం), 12వ తేదీ (శుక్రవారం), 13వ తేదీ (శనివారం), 14వ తేదీ (ఆదివారం), 15వ తేదీ (సోమవారం) మంచి రోజులు ఉండగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ముహూర్తాలు లేవని వేదపండితులు పేర్కొన్నారు. జూలైలో 6 రోజులు శుభముహూర్తాలకు అనువుగా ఉన్నాయని పండితులు తెలిపారు.
నవంబర్‌లో 11 రోజులు, డిసెంబర్‌లో 5 రోజులు
ఇక నవంబర్ 12వ తేదీ (మంగళవారం), నవంబర్ 13వ తేదీ (బుధవారం), 16వ తేదీ (శనివారం), 17వ తేదీ (ఆదివారం), 18వ తేదీ (సోమవారం), 22వ తేదీ (శుక్రవారం), 23వ తేదీ (శనివారం), 25వ తేదీ (సోమవారం), 26వ తేదీ (మంగళవారం), 28వ తేదీ (గురువారం), 29వ తేదీ (శుక్రవారం) డిసెంబర్‌లో 4వ తేదీ (బుధవారం), 5వ తేదీ (గురువారం), 9వ తేదీ (సోమవారం), 10వ తేదీ (మంగళవారం), 14వ తేదీ (శనివారం) శుభకార్యాలకు అనువైనవిగా ఉన్నాయని వేదపండితులు తెలిపారు. నవంబర్‌లో 11 రోజులు, డిసెంబర్‌లో 5 రోజులు అనువైనవని పండితులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News