Wednesday, January 22, 2025

మరకత శివాలయాన్ని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గ్రేటర్ సమీపంలోని వెలిసిన చందిప్ప మరకత శివాలయాన్ని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు టీవీ సినీ నటి రోజా భారతి తల్లి పేర్కొన్నారు. సోమవారం మరకత శివాలయాన్ని పద్మావతి కళ్యాణం సీరియల్ టీవీ సినీ యాక్టర్ రోజా భారతి శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంతో మహిమగల శివలింగాన్ని దర్శించుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. దేవస్థానం చైర్మన్ సదానంద గౌడ్ ఆల్ ఇండియా ప్రచార కమిటీ చైర్మన్ ధూపాటి దయాకర్ రాజు మాట్లాడుతూ 11వ శతాబ్దం నాటి కాలంలో ఎంతో మహిమగల మరకత శివాలయం చెందిప్ప గ్రామంలో ఏర్పాటయిందని, ఎంతో మహిమగల మరకత శివాలయం శంకర్పల్లికి సమీపమైన చందిప్ప గ్రామంలో ఏర్పాటు కావడం ఇక్కడి ప్రాంత ప్రజల అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు హనుమంతు, పూజారి ప్రమోద్ పూజల అనంతరం శివుడి ఫోటో, కండువాతో సత్కరించారు. పూజల అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News