- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: భారత స్టార్ రెజ్లర్, ఒలింపిక్ రజత పతక విజేత రవికుమార్ దహియాను రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి ఘనంగా సన్మానించారు. నగర శివార్లలోని మెలుహా ఇంటర్నేషనల్ స్కూల్‌లో నిర్వహిస్తున్న మార్షల్ ఆర్ట్ క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి రవికుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శాట్స్ చైర్మన్‌గా కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో చైర్మన్ రవికుమార్ ఘనంగా సత్కరించారు. ఒలింపిక్ వంటి విశ్వ క్రీడల్లో పతకం గెలిచి దహియా భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటారని ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని చైర్మన్ ఆకాంక్షించారు.
- Advertisement -