Tuesday, January 21, 2025

జాతీయ చలన చిత్ర ఫిల్మ్ క్రిటిక్ అవార్డు గ్రహీత పురుషోత్తమాచార్యకు ఘన సన్మానం

- Advertisement -
- Advertisement -

సినీ రంగంలో అవార్డు రావడం గర్వకారణం
నల్గొండ జెడ్‌పి ఛైర్మన్ బండ నరేందర్ రెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్ : జాతీయ చలన చిత్ర ఫిల్మ్ క్రిటిక్ అవార్డు గ్రహిత పురుషోత్తమాచార్యను పలువురు ఘనంగా సన్మానించారు. జాతీయ సినీ రంగంలో తెలంగాణకు చెందిన వ్యక్తి పురుషోత్తమాచార్య ఉత్తమ సినీ విమర్శకులు అవార్డు అందుకోవడం అందరికీ గర్వకారణమని నల్గొండ జెడ్‌పి ఛైర్మన్ బండ నరేందర్ రెడ్డి అన్నారు. సినీ రంగంలో అవార్డు రావడం ఎంతో గర్వకారణం అని పేర్కొన్నారు.

నల్గొండ జిల్లా గ్రంధాలయ ఛైర్మెన్ రెగట్టే మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో పురుషోత్తమా చార్యకు జరిగిన ఈ సన్మాన కార్యక్రమానికి జెడ్‌పి ఛైర్మెన్ బండ నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదటగా కళామతల్లికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం అవార్డు గ్రహీత పురుషోత్తమాచార్యులును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిఈఓ బిక్షపతి, సంస్థ కార్యదర్శి బి.బాలమ్మతో పాటు ఇతర ముఖ్యులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News