Thursday, January 9, 2025

గురుకుల ప్రతిభా కళాశాల విద్యార్థులకు సన్మానం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వివిధ వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత సాధించిన సాంఘీక సంక్షేమ గురుకుల ప్రతిభా కళాశాల విద్యార్థులకు ఘనంగా సన్మానించారు. 2023 విద్యా సంవత్సరానికి గాను 204 ఎంబిబిఎస్ సీట్లు, 65 ఐఐటి, 80 నీట్, 20 ఐఐఐటి/జిఎఫ్‌టిఐ సీట్లు పొందేందుకు అర్హత సాధించిన ఈ కళాశాలకు చెందిన విద్యార్థులకు గురువారం బేగంపేట్‌లోని ఐఎఎస్ అసోసియేషన్ కన్వెన్షన్ హాల్‌లో ఎస్‌డి అభివృద్ధి శాఖ కార్యదర్శి రాముల బొజ్జ, టిఎస్‌డబ్లుర్‌ఐఎస్ కార్యదర్శి డి. రోనాల్డ్ రోస్‌ల ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా అధికారులు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు శుభాభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సంక్షేమ గురుకులాలు యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయని, విద్యార్థులు ఈ ప్రతిభా కళాశాలలో చేరి ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాక్షించారు. అధ్యాపక సిబ్బందిని ప్రధాన ఆచార్ములను, ఇతర సంబంధిత అధికారులను సన్మానించి వారి కృషిని అభినందించారు. రాబోయే రోజుల్లో ఇంకా అద్భుత విజయాలు సాధించాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో ర్యాంకులు సాధించిన విద్యార్థులు తమ తమ అనుభవాలను, తాము సాధించిన విజయ క్రమాన్ని ఇతర విద్యార్థులతో, అధికారులతో పంచుకున్నారు. ఈ విజయాలకు కారకులైన ముఖ్యమంత్రి కెసిఆర్; మంత్రి కొప్పుల ఈశ్వర్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓఎస్‌డి చంద్రకాంత్, జాయింట్ సెక్రటరి సక్రు నాయక్, ఓఎస్‌డి ఆపరేషన్‌స ఎవి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Gurukul 3

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News