మన తెలంగాణ/హైదరాబాద్ : పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు రూ. 25 లక్షల నగ దు బహుమతి ప్రభుత్వం తరఫున అందిస్తున్నామని, దీంతో పాటు ప్రతీ నెల పద్మశ్రీ అ వార్డు పొందిన కవులు, కళాకారులకు రూ. 25 వేల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పద్మ అవార్డు గ్రహీతలను సన్మానించడం ఒక బాధ్యతగా భావించి ఈ సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఇది రాజకీయాలకు అతీతమైన కార్యక్రమం అని, తెలుగువాళ్లు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా వారంతా మన వారేనన్నారు. ఒక తెలుగు వాడిగా వెంకయ్య నాయుడు రాష్ట్రపతి స్థా యికి ఎదగాలని కోరుకుంటున్నానన్నారు. సంస్కృతి సంప్రదాయాలను కాపాడేందుకు మన మంతా ఏకమై ముందుకు సాగాలన్నారు. ఈ మేరకు శిల్పకళా వేదికలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పద్మ అవార్డు గ్రహీతలకు సన్మాన కార్యక్రమం ఆదివా రం నిర్వహించింది. ముఖ్య అతిథిగా సిఎం రేవంత్ రెడ్డి హాజరైన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారితో పాటు పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు వెంకయ్య నాయుడు, సినీ నటుడు చిరంజీవి, పద్మా అవార్డు గ్రహీతలు, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, కళాకారులు పాల్గొన్నారు. పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ నటుడు చిరంజీవి సహా పురస్కారాలు అందుకున్న వారిని సిఎం రేవంత్ రెడ్డి ఘనంగా సన్మానించారు.
పద్మశ్రీకి ఎంపికైన తెలంగాణ కళాకారులను ఆయన సత్కరించారు. పద్మశ్రీ అవార్డు దక్కిన వారికి రూ.25 లక్షలు బహుమానంగా ఇచ్చారు. వారికి ప్రతి నెలా రూ.25 వేల పింఛన్ అందిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. మట్టిలో మాణిక్యాలను గుర్తించి కేంద్రం పద్మశ్రీ పురస్కారాలను ఇచ్చిందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ వెంకయ్యను సన్మానించడం మనల్ని మనమే సన్మానించుకోవడం అన్నారు. ఢిల్లీ వెళ్లే తెలుగు రాజకీయ నేతలకు వెంకయ్య నాయుడు పెద్ద దిక్కు అని చెప్పారు. “ ఢిల్లీ వెళ్లే తెలుగు రాజకీయ నేతలకు వెంకయ్యనాయుడు పెద్ద దిక్కు. ఆయన్ను సన్మానించడం, మనల్ని మనం సన్మానించుకోవడమే. చిరంజీవి పున్నమినాగులో ఏ స్థాయిలో నటించారో, సైరాలోనూ అదే స్థాయిలో నటించారు. ఇది రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం. పద్మ అవార్డు గ్రహీతలను సన్మానించడం ఒక బాధ్యతగా భావించాం. తెలుగువాళ్లు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా మనవారే. ఒక మంచి సంప్రదాయానికి పునాది వేసేందుకే ఈ కార్యక్రమం. ఈ సంప్రదాయాన్ని ఇలాగే కొనసాగించాలి. అవార్డు గ్రహీతలు ప్రభుత్వాన్ని అభినందించడమంటే, మన ప్రజా పాలనను అభినందించినట్లే. పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు రూ.25 లక్షల నగదు బహుమతి ప్రభుత్వం తరపున అందిస్తున్నాం. దీంతో పాటు పద్మశ్రీ అవార్డు పొందిన కవులు, కళాకారులకు ప్రతి నెలా రూ.25 వేల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించాం.” అని రేవంత్ రెడ్డి అన్నారు. అప్పట్లో జైపాల్‌రెడ్డి, వెంకయ్య జంటకవుల్లా ఉండేవారని, ప్రజల కోసం పరితపించేవారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రోడ్డుపై ప్రయాణించిన నేతల్లో దేశంలోనే వెంకయ్యది అగ్రస్థానం అన్నారు. వెంకయ్య నాయుడు రాష్ట్రపతి కావాలని ఆకాంక్షిస్తున్నాని చెప్పారు. ఇదే సమయంలో తెలంగాణ నుంచి పద్మ శ్రీ అవార్డులు గెలుచుకున్న వారిని సీఎం కొనియాడారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు ప్రజలంతా ఏకమై ముందుకు సాగాలని కోరారు. “పద్మ అవార్డు గ్రహీతలను సన్మానించడం ఒక బాధ్యతగా భావించాం. ఇది రాజకీయాలకు అతీతమైన కార్యక్రమం. తెలుగువాళ్లు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా మనవారే. ఒక మంచి సంప్రదాయానికి పునాది వేసేందుకే ఈ కార్యక్రమం. ఈ సంప్రదాయాన్ని ఇలాగే కొనసాగించాలి. అవార్డు గ్రహీతలు ప్రభుత్వాన్ని అభినందించడమంటే. మన ప్రజా పాలనను అభినందించినట్లే ” అని రేవంత్ రెడ్డి అన్నారు.
అవార్డు గ్రహీతలకు సిఎం రేవంత్ సన్మానం
ప్రతిష్ఠాత్మక పద్మ విభూషణ్ అవార్డుకు కేంద్ర ప్రభుత్వం ఐదుగురిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితోపాటు మెగాస్టార్ చిరంజీవి, బిందేశ్వర్ పాఠక్, వైజయంతిమాల బాలికి, పద్మాసుబ్రహ్మణ్యానికి పద్మవిభూషణ్ ప్రకటించింది. మొత్తం 132 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసిన నేపథ్యంలో తెలంగాణలో నారాయణపేట జిల్లా దామరగిద్దకు చెందిన బుర్రవీణ వాయిద్య కారుడు దాసరి కొండప్ప, జనగామకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హరికథ కళాకారిణి ఉమా మహేశ్వరి పద్మశ్రీ అవార్డులకు ఎంపికయ్యారు. ఈ క్రమంలో వీరిని రేవంత్ ఘనంగా సన్మానించారు.
మట్టిలో మాణిక్యాలకు పద్మ పురస్కారాలు ఇవ్వడం గొప్ప విషయం : వెంకయ్య నాయుడు
ఈ ఏడాది పద్మ పురస్కారాలకు ఎంపికైన వారిని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. ఇందులో భాగంగా మట్టిలో మాణిక్యాలను గుర్తించి కేంద్రం పద్మ పురస్కారాలు ఇవ్వడం గొప్ప విషయమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. జీవితంలో పెద్దగా అవార్డులు, సన్మానాలు తీసుకోలేదన్న వెంకయ్యనాయు డు, కేవలం ప్రధాని మోదీ మీద గౌరవంతో పద్మ విభూషణ్ తీసుకున్నానని తెలిపారు. పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారిని రాష్ట్ర ప్రభుత్వం శిల్పకళావేదికగా స న్మానించడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు కళామతల్లికి ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్లు అయితే, చిరంజీవి మూడో కన్ను అని వెంకయ్యనాయుడు కొనియాడారు.
గద్దర్ పురస్కారాలుగా
నంది అవార్డులు మంచి నిర్ణయం:
తనకు పద్మ విభూషణ్ ప్రకటించినప్పుడు వచ్చిన ఆ నందం అంతా ఇంతా కాదని సినీ నటుడు చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. అభిమానుల ఆశీర్వాదాలు చూస్తుంటే, తన జన్మ ధన్యమైనట్లు అనిపిస్తుందని అన్నారు. కళాకారులకు అవార్డులు, ప్రశంసలు తరచుగా వస్తుంటాయ ని, కానీ ప్రభుత్వమే చొరవ తీసుకుని పద్మ పురస్కార విజేతలను సన్మానించడం హర్షించదగ్గ విషయమని చిరంజీవి పేర్కొన్నారు. నంది అవార్డులను చాలా కాలంగా నిలిపివేయడం నిరుత్సాహ పరిచిందని సినీ నటుడు చిరంజీవి అన్నారు. నంది అవార్డుల పేరును గద్దర్ పురస్కారాలుగా మార్చడం ఎంతో సముచితం, ఆనందమని పేర్కొన్నారు. గద్దర్ అవార్డులు త్వరలో ఇస్తామని ప్రకటించ డం సంతోషదాయకమని చెప్పారు. ఎక్కడ కళాకారులు గౌరవించబడతారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందన్నా రు. ఈ మేరకు హైదరాబాద్ మాదాపూర్‌లోని శిల్పకళా వేదికగా జరిగిన పద్మ అవార్డు గ్రహీతల సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అభిమానుల అశీర్వాదాలు చూస్తుంటే తన జన్మ ధన్యమైందని అనిపిస్తుందని తెలిపారు. పురస్కారాలు ప్రకటించిన వెంటనే సన్మానం చేయాలనే ఆలోచన ఇంతవరకు ఎవరికీ రాలేదని చె ప్పారు. రాజకీయాల్లో వెంకయ్యనాయుడు నిజమైన రాజనీతిజ్ఞుడని పేర్కొన్నారు. వాజ్‌పేయీ అంత హుందాతనం వెంకయ్యనాయుడిలో ఉందని కొనియాడారు. వివిధ రంగాల్లోని గొప్ప వ్యక్తులను గుర్తించి పద్మ పురస్కారాలు ప్రకటించడం సంతోషమని చిరంజీవి వివరించారు.