Monday, December 23, 2024

వివేక్‌పై ఫెమా కేసు

- Advertisement -
- Advertisement -

రూ.200కోట్ల అక్రమ
లావాదేవీలు గుర్తించిన ఇడి

మన తెలంగాణ/హైదరాబాద్ : మాజీ ఎం పి గడ్డం వివేక్ వెంకటస్వామి ఇంట్లో సోదా లపై ఇడి ప్రకటన విడుదల చేసింది. విజిలె న్స్ సెక్యూరిటీ పేరుతో వివేక్ పెద్ద ఎత్తున అక్రమ లావాదేవీలు జరిపినట్లు తెలిపింది. దాదాపు 200 కోట్ల రూపాయల అక్రమ లావాదేవులను గుర్తించినట్లు ప్రకటించింది. నకిలీ పత్రాలతో ఆస్తులు కొనుగోలు చేసిన ట్లుగా గుర్తించారు. గడ్డం వివేక్ తన భార్య, కుటుంబ సభ్యుల పేర్లతో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. విజిలెన్స్ సెక్యూరిటీ పేరుతో ఎలాంటి వ్యాపారం లేక పోయినా భారీగా లావాదేవీలు జరిపినట్లు పేర్కొంది.

ఫెమా చట్టం కింద వివేక్‌పై కేసు లు నమోదు చేసినట్లు ఇడి పేర్కొంది. విజిలె న్స్ సెక్యూరిటీ పేరుతో ఇప్పటివరకు 20 ల క్షల రూపాయల టాక్స్ చెల్లించినట్లు సోదా ల్లో గుర్తించినట్లు ఇడి తెలిపింది. ‘రూ.8 కోట్ల బ్యాంకు లావాదేవీలపై ఫిర్యాదు అం దింది. పోలీసుల ఫిర్యాదు మేరకు సోదాలు చేశాం. విశాఖ ఇండస్ట్రీస్, విజిలెన్స్ సెక్యూ రిటీ మధ్య రూ.100 కోట్ల లావాదేవీలు జరిగాయి. డబ్బు విజిలెన్స్ సెక్యూరిటీ రాబ డి కాదని తేలింది. వ్యాపారం ద్వారా రూ.20 లక్షల ఆదాయమే వచ్చిం ది. ఆస్తులు, అప్పులు కలిపి రూ.64 కోట్లతో బ్యాలెన్స్ షీట్ ఉంది.

లా వాదేవీలు మాత్రం రూ.200 కోట్లకు పైగా గుర్తించాం. కంపెనీలను వివే క్ పరోక్షంగా నియంత్రిస్తున్నారు. విజిలెన్స్ సెక్యూరిటీ సంస్థకు యశ్వం త్ రియల్టర్స్ మాతృ సంస్థ. యశ్వంత్ రియల్టర్స్‌లో విదేశీయుల షేర్లు ఎక్కువగా ఉన్నాయి. వివేక్ ఫెమా నిబంధనలు ఉల్లంఘించి విదేశంలో సంస్థ ఏర్పాటు చేశారు. సోదాల్లో భారీగా ఎలక్ట్రానిక్ పరికరాలు, డాక్యు మెంట్లు స్వాధీనం చేసుకున్నాం. దర్యాప్తులో భాగంగా విజిలెన్స్ సెక్యూరి టీ సంస్థ బోగస్‌గా తెలుస్తోంద’ని ఇడి అధికారులు తమ ప్రకటనలో వెల్లడించారు. తదుపరి విచారణ పురోగతిలో ఉందని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News