- Advertisement -
జెరూసలెం : అల్ జజీరాకు చెందిన ఓ మహిళా రిపోర్టర్ అక్కడ జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడి తరువాత మృతి చెందారు. వెస్ట్‌బ్యాంక్ లోని జెనిన్ టౌన్‌లో బుధవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ దాడులను ఈ మహిళా రిపోర్టరు శ్రీరీన్ అబూ అక్లేహ్‌కు అతి దగ్గరి నుంచి వచ్చి తాకిన తూటా తగిలింది. కొద్ది సేపటి తరువాత ఆమె చనిపోయిందని, వార్త కవరేజ్‌కు ఆమె వెంట ఉన్న ఇద్దరు సహోద్యోగులు తెలిపారు. ఇజ్రాయెల్ బలగాల కాల్పుల్లోనే ఆమె చనిపోయిందని వీరు తెలిపారు. అయితే ఈ వాదనను ఇజ్రాయెల్ ఖండించింది. ఇరువురు జర్నలిస్టులపై పాలస్తీనియా బలగాలే కాల్పులు జరిపిందని తెలిపే సాక్షాధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపింది. . కాల్పుల్లో గాయపడ్డ మరో జర్నలిస్టుఅలీ సమౌదీ చికిత్స పొందుతున్నారు.
- Advertisement -