- Advertisement -
హైదరాబాద్: మేకప్ స్టూడియా పెట్టిస్తానని నమ్మించి ఓ వ్యక్తి బ్యూటీషియన్‌పై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన సంఘటన హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బుధవారం తన పుట్టినరోజు కావడంతో సంజీవ్ రెడ్డి బాధితురాలి ఇంటికెళ్లి ఆమెతో బలవంతంగా మద్యం తాగించి మరోసారి అత్యాచారం పాల్పడ్డాడు. నిందితుడు సంజీవరెడ్డి తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, వేధింపులు భరించలేకపోతున్నానని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -