రాష్ట్రంలో జరుగుతున్న గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షల్లో ఒక అభ్యర్థిని కాపీయింగ్‌కు పాల్పడగా, ఆమెను టిజిపిఎస్‌సి డీబార్ చేసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగల్‌పల్లిలోని సివిఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షలో కాపీయింగ్‌కు పాల్పడుతూ మహిళా అభ్యర్థిని అధికారులకు పట్టుబడ్డారు. దీంతో అభ్యర్థి ఆన్సర్ షీట్‌కు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చీర కొంగులో చిట్టీలు తీసుకొచ్చి మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతుండగా గుర్తించిన ఇన్విజిలేటర్ అధికారులకు సమాచారం అందించారు.
ఈ మేరకు అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన అభ్యర్థిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, కాపీయింగ్ పాల్పడిన అభ్యర్థిని మహబూబ్ నగర్ జిల్లా , పెద్ద మందాడి మండలంగట్ల ఖానాపూర్ గ్రామం అని సమాచారం. ఆమె ప్రభుత్వ ఉద్యోగి అని తెలిసింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.అయితే కాపీయింగ్‌పై అభ్యర్థుల్లో ఆందోళన నెలకొన్నది.