Sunday, December 22, 2024

కెటిఆర్ పర్యటన… నాలాలో పడి మహిళా కానిస్టేబుల్ మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భద్రాచలంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ పర్యటనలో శనివారం విషాదం నెలకొంది. నాలాలో పడి మహిళా కానిస్టేబుల్ మృతిచెందింది. కెటిఆర్ పర్యటన సందర్భంగా భద్రాచలంలో బందోబస్తు కోసం వచ్చిన మహిళా కానిస్టేబుల్ భారీ వర్షం కారణంగా రోడ్డు దాటుతూ నాలాలో పడి చనిపోయింది. రామాలయం అన్నదానసత్రం వద్ద నాలాలో కానిస్టేబుల్ పడినట్లు తెలుస్తోంది. కొద్దిదూరంలోని స్లూయిజ్ కాలువలో మృతదేహం లభ్యం అయింది. మృతదేహాన్ని బయటకు తీసిన అధికారులు కానిస్టేబుల్ శ్రీదేవిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అటు భారీ వర్షం కారణంగా మంత్రి కెటిఆర్ భద్రాచలం పర్యటన రద్దు చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News