Tuesday, January 7, 2025

ఇబ్రహీంపట్నంలో దారుణం..లేడీ కానిస్టేబుల్ ను నరికి చంపిన తమ్ముడు!

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: తెలంగాణలో మరో పరువు హత్య చోటుచేసుకుంది. ఓ మహిళా కానిస్టేబుల్ ను సొంత తమ్ముడే నరికి చంపినట్లు తెలుస్తోంది. ఈ దారుణ సంఘటన జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలంలో విషాదం చోటుచేసుకుంది. హయత్‌నగర్‌ పీఎస్‌లో నాగమణి అనే మహిళా కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం మండలంలోని రాయపోలు-ఎండ్లగూడ రోడ్డులో సోమవారం ఉదయం నాగమణి స్కూటీపై డ్యూటీకి వెళ్తుండగా.. సొంత తమ్ముడు ప్రసాద్ కారుతో ఢీకొట్టి, తర్వాత కత్తితో ఆమె మెడపై నరికి చంపాడు. సమాచారం అందుకున్న సీఐ సత్యనారాయణ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కాగా, నాగమణి నెల రోజుల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో నాగమణి కుటుంబ సభ్యులు.. ఆమెపై చాలా ఆగ్రహంతో ఉన్నారు. సమయం కోసం వేచి చూచిన తమ్ముడు.. ఇవాళ ఉదయం డ్యూటీకి వెళ్తుండగా అటాక్ చేసి హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News