Friday, December 20, 2024

కర్నాటకలో మైన్స్ అధికారిణి హత్య

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కర్నాటక రాష్ట్ర ప్రభుత్వ అధికారిణి ప్రతిమ దారుణ హత్యకు గురయ్యారు. శనివారం రాత్రి ఇంట్లోనే ఆమె హత్య జరిగినట్లు ఆదివారం ఉదయం పోలీసులు నిర్థారించారు. ఈ సమయంలో ఆమె భర్త , కుమారుడు ఇంట్లో లేరు. బెంగళూరులోని సుబ్రమణ్యపురలోని నివాసంలో కత్తిపోట్లకు గురై మరణించిన 45 సంవత్సరాల ఆఫీసరు రాష్ట్ర గనులు, జియాలజి విభాగంలో డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్నారు. గత ఎనిమిదేళ్లుగా ఈ ఇంట్లోనే ప్రతిమ కుటుంబం నివసిస్తోంది. ఆమెను శనివారం సాయంత్రం డ్రైవర్ ఇంటివద్ద చేర్చివెళ్లారు. రాత్రి 8.30 ప్రాంతంలో హత్య జరిగినట్లు వెల్లడైంది. ఆదివారం ఉదయం ప్రతిమ సోదరుడు ఇంటికి వచ్చారు. ఆమె కత్తిపోట్లతో చనిపోయి ఉండగా గుర్తించారు. వెంటనే పోలీసులకు విషయం తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు బెంగళూరు సౌత్ డిసిపి రాహుల్ కుమార్ షార్పూర్‌వాద్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News