Wednesday, January 22, 2025

సినీ మహిళా నిర్మాతకు కెబిఆర్ పార్క్‌లో లైంగిక వేధింపులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కెబిఆర్ పార్క్‌లో జాగింగ్ చేస్తున్న సినీ మహిళా నిర్మాతపై గుర్తుతెలియని వ్యక్తి లైంగికంగా వేధించిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం…మహిళా సినీ నిర్మాత ఉదయం జాగింగ్ చేసేందుకు కేబిఆర్ పార్క్‌కు ఉదయం వచ్చింది.

జాగింగ్ చేస్తుండగా ఓ వ్యక్తి ఎదురుగా వచ్చి ఆమె వీడియోలు తీయడమే కాకుండా, అసభ్యంగా ప్రవర్తించాడు. బ్లాక్ కలర్ వెర్నా కారులో నిందితుడు వచ్చినట్లు తెలిసింది. ఎలాగోలా నిందితుడి నుంచి తప్పించుకున్న బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పోలీసులు ఐపిసి 354ఏ, 354డి, 509కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని గుర్తించేందుకు సిసిటివి ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News