Monday, December 23, 2024

సైనికాధికారులపై దాడి.. స్నేహితురాలిపై అత్యాచారం

- Advertisement -
- Advertisement -

మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. విహార యాత్రకు వెళ్లుతున్న ఇద్దరు సైనికాధికారులపై దాడికి పాల్పడ్డ దుండగులు వారి స్నేహితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. బద్గోండా పోలీసు స్టేషన్ అధికారి లోకేంద్ర సింగ్ హిరోరో సంబంధిత ఘటన వివరాలు వెల్లడించారు. పాతికేళ్ల లోపు వయస్సున్న ఇండోర్ మోవ్ కంటోన్మెంట్ టౌన్ సైనికాధికారులు పిక్నిక్‌కు వెళ్లారు. వారి వెంబడి ఇద్దరు స్నేహితురాళ్లు కూడా ఉన్నారు.

బుధవారం మధ్యాహ్నం ఏడుగురు గుర్తు తెలియని వ్యక్తులు వారి విహార యాత్ర స్థలికి వచ్చారు. పిక్నిక్‌కు వచ్చిన వారిపై దాడికి దిగారని, అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసు అధికారి వెల్లడించారు. ఒకరిపై దుండగులు అత్యాచారానికి పాల్పడిన విషయం ఆసుపత్రిలో చికిత్సకు తరలించిన తరువాత నిర్థారణ అయింది. కేసు నమోదు చేశామని , దుండగులను పట్టుకునేందుకు బృందాలు రంగంలోకి దిగాయని ఇండోర్ రూరల్ ఎస్‌పి హితికా వసల్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News