హైదరాబాద్: నగరంలోని జవహర్‌లాల్ నెహ్రూ జూలాజికల్ పార్కులో ఆడ జిరాఫీ బుధవారం కన్నుమూసినట్టు తెలుస్తోంది. మృత్యవాతపడిన జిరాఫీ పేరు బబ్లీ. దాని వయసు సుమారు ఏడు సంవత్సరాలు. నెహ్రూ జూలాజికల్ పార్క్ మార్చి 2019లో మార్పిడి కార్యక్రమంలో భాగంగా కోల్‌కతాలోని అలిపోర్ జూలాజికల్ గార్డెన్స్ నుండి ఆరేళ్ల మగ జిరాఫీ సన్నీతో పాటు బబ్లీని తీసుకోచ్చారు. బబ్లీ అనారోగ్యంతో నాలుగు రోజులపాటు ఆహారం తీనట్లేదని, ఊపిరితిత్తుల్లో సమస్య తలెత్తినట్టు గుర్తించి తగు వైద్యం అందించినా ఫలితం లేకుండా పోయిందని సీనియర్ అధికారి వెల్లడించారు. జూ అధికారులు రోజుమాదిరిగానే రాత్రి జంతువులను వాటి వాటి ఎన్‌క్లోజర్లలోకి పంపించామని చెప్పారు. ఆ సమయంలో జిరాఫీ సజీవంగానే ఉందని, అర్ధరాత్రి ఎప్పుడు చనిపోయిందో తెలియదన్నారు. నిన్న జీరాఫీల దగ్గరకు వెళ్లిన జంతు సంరక్షకుడు బబ్లీ చనిపోయినట్టు గుర్తించారని అధికారులు తెలిపారు. దీన్ని బబ్లీ చనిపోవడంతో ప్రస్తుతం జూలో రెండు మగ జిరాఫీలు ఉన్నాయని అధికారి తెలిపారు.
Female giraffe dies in Hyderabad Zoo Park