Sunday, November 17, 2024

రహస్యంగా జీవించే మహిళా నాగ సాధువులు

- Advertisement -
- Advertisement -

హిమాలయాలు: మహిళా నాగ సాధువులు చాలా అరుదుగా దర్శనమిస్తుంటారు. చాలా మందికి నాగ సాధువుల గురించైతే తెలుసు కానీ మహిళా నాగ సాధువులుంటారని మాత్రం తెలియదు. నాగ సాధువులను అఘోరిలని కూడా అంటుంటారు. హిందూ ధర్మంలో నాగ సాధువుల వలెనే మహిళా నాగ సాధువులు కూడా ఉంటారు. అయితే మహిళా నాగ సాధువులు కావడానికి కఠోర తపస్సు చేయాల్సి ఉంటుంది. వారు అనేక కఠిన పరీక్షలు ఎదర్కోవలసి ఉంటుంది. మహిళా నాగ సాధువుల పరీక్షలు అనేక ఏళ్లు సాగుతుంది. వారు కఠినమై బ్రహ్మచారిణి నియమాలు పాటిస్తారు. వారు బతికి ఉండగానే తమ పిండదానం చేసుకుంటారు. శిరో ముండనాన్ని కూడా చేయించుకుంటారు. అన్ని పరీక్షలు ముగిశాకే వారు మహిళా నాగ సాధువులవుతారు.
మహిళా నాగ సాధువులు చాలా అరుదైన సందర్భాలలోనే కనిపిస్తుంటారు. వారు సామాన్యులకు దూరంగా దట్టమైన అడవులలో, కొండలలో, గుహలలో ఉంటుంటారు. తమ సమయమంతా భగవంతుడి భక్తి మార్గంలో వెచ్చిస్తుంటారు. వారు అడవులు, కొండలు వదిలి అరుదైన సమయాల్లోనే జనంలోకి వస్తుంటారు. మహిళా నాగ సాధువులు చాలా వరకు కుంభమేళ, మహాకుంభమేళల్లోనే దర్శనమిస్తుంటారు. ఆ తర్వాత కనిపించకుండా పోతారు. పురుష నాగ సాధువులు కూడా తక్కువగానే దర్శనమిస్తుంటారు. అయితే పురుష నాగ సాధువుల కంటే మహిళా నాగ సాధువులే ప్రపంచం ముందు అరుదుగా కనిపిస్తుంటారు.

పురుష నాగ సాధువులు సామాన్యంగా నగ్నంగానే కనిపిస్తుంటారు. అయితే మహిళా నాగ సాధువులు ప్రపంచానికి చాలా తక్కువగా కనిపిస్తుంటారు. కానీ వారు వస్త్రాలు ధరిస్తారు. అయితే అవి కుట్టని కాషాయ రంగులో ఉంటాయి. వాటిని వారు శరీరంలోని కొంత భాగానికి చుట్టుకుంటారంతే. అంతేకాదు వారు తమ నుదుటన తిలకాన్ని ధరిస్తారు. శరీర భాగాలకు భస్మం పూసుకుంటారు. హిందూ ధర్మంలో మహిళా నాగ సాధువులకు మంచి గౌరవం ఇస్తారు. వారిని ‘మాతా’ అని సంబోధిస్తారు.

Female Naga Sadhus 2

Female Naga Sadhus 3

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News