Sunday, September 8, 2024

మహిళా నక్సలైట్ లొంగుబాటు

- Advertisement -
- Advertisement -

కబిర్ధామ్ (ఛత్తీస్‌గఢ్): మూడు రాష్ట్రాల్లో తనపై రూ.13 లక్షల రివార్డు ఉన్న మహిళా నక్సలైట్ హిడ్మె కొవాసి అలియాస్ రణిత (22) శనివారం కబిర్థామ్ జిల్లాలో పోలీస్ అధికారుల ఎదుట లొంగిపోయింది. మావోయిస్ట్ ఎంఎంసి జోనల్ కమిటీ, గొండియారాజనందిగావ్ బాలఘాట్ (జిఆర్‌బి)డివిజన్స్ తండా/మలజ్‌ఖండ్ ఏరియా కమిటీ మెంబర్ (ఎసిఎం) అయిన ఆమె చాలా చురుకుగా నక్సల్స్ కార్యకలాపాలు సాగించినట్టు పోలీస్ అధికారులు తెలిపారు.

ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో రూ.5 లక్షల వంతున, మధ్యప్రదేశ్‌లో రూ.3 లక్షల వంతున ఆమెపై రివార్డు ప్రకటించి ఉంది. సీనియర్ నక్సల్స్ సాగించిన అరాచకాలకు , శుష్క మావో సిద్ధాంతానికి విసుగెత్తి ఆయుధాలు విసర్జించినట్టు ఆమె చెప్పిందని అధికారులు పేర్కొన్నారు. ఆమెకు రూ. 25,000 వరకు ఆర్థిక సాయం అందుతుందని . రాష్ట్ర పునరావాస విధానం కింద ఇతన సౌకర్యాలు సమకూర్చడమవుతుందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News