Thursday, January 23, 2025

వాహనాల తనిఖీ… మహిళ ఎస్ఐని ఢీకొట్టి.. చంపేశారు

- Advertisement -
- Advertisement -

రాంచీ: వాహనాలు తనిఖీ చేస్తుండగా మహిళ ఎస్ఐని వాహనంతో ఢీకొట్టి చంపిన సంఘటన జార్ఖండ్ లోని తుపుదనాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…తుపుదనా ఎస్ఐ సంధ్యా తోప్నో బుధవారం రాత్రి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఆమె తనిఖీ చేస్తుండగా వ్యాన్ ఆమె పైనుంచి పికప్ వ్యాన్ ను  దూసుకెళ్లింది. దీంతో ఆమె ఘటనా స్థలంలోనే చనిపోయారు. వెంటనే పోలీసులు వాహనాన్ని నిలువరించి డ్రైవర్ ను అరెస్టు చేశారు. హర్యానాలోని పంచ్ గావ్ లోని నూహ్ ప్రాంతం ఆరావళి పర్వతాలలో రాళ్లను అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం రావడంతో డిఎస్ పి సురేంద్ర సింగ్ బిష్ణోయ్ అక్కడికి చేరుకున్నాడు. రాళ్ల లోడ్ తో వెళ్తున్న ఎదురెళ్లి ఆపడానికి ప్రయత్నించాడు. డ్రైవర్ వాహనాన్ని డిఎస్ పి సురేంద్ర సింగ్ పైనుంచి పోనిచ్చాడు. దీంతో సురేంద్ర సింగ్ ఘటనా స్థలంలోనే చనిపోయిన విషయం తెలిసిందే. వెంటనే పోలీసులు కాల్పులు జరపడంతో డ్రైవర్ కాలులోకి బుల్లెట్ దిగింది. వెంటనే అతడిని అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News