Wednesday, January 22, 2025

స్వర్ణాలయం వద్ద మొదటిసారి మహిళా భద్రతా సిబ్బంది

- Advertisement -
- Advertisement -

 

అమృత్‌సర్:ఇటీవల సంభవించిన తేలికబాంబు పేలుడు సంఘటనలను పురస్కరించుకుని స్వర్ణాలయం పరిసరాలలో భద్రత ఏర్పాట్లను శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ(ఎస్‌జిపిసి) కట్టుదిట్టం చేసింది. మొట్టమొదటిసారిగా స్వర్ణాలయం ప్రవేశ ద్వారాల వద్ద మహిళా భద్రతా సిబ్బందిని ఎస్‌జిపిసి నియమించింది. అంతేగాక..ఆలయంలో ప్రవేశించే సందర్శకులు పాటించాల్సిన నియమ నిబంధనలను సూచించే భారీ ఎల్‌ఇడి స్కీన్లను కూడా ఆలయం వద్ద ఏర్పాటు చేసింది. అకాల్ తక్త్, మీరీ పీరి చిహ్నం, చారిత్రక దుఖ్ భంజని బేరి, బేర్ బాబా బుడా సాహిబ్, లచి బేర్ తదితర ముఖ్యమైన ప్రదేశాల గురించి కూడా ఈ స్క్రీన్ల ద్వారా సందర్శకులకు తెలియచేస్తారు.

Also Read: పవన్‌కు దమ్ముంటే నన్ను చెప్పుతో కొట్టు: ప్రసన్న 

ఇటీవల స్వర్ణాలయ కాంప్లెక్స్‌లో ఉన్న శ్రీ గురురాం దాస్ ఇన్ హోటల్‌లో బసచేసిన కొందరు వ్యక్తుల చిన్నపాటి పేలుడు సృష్టించారు. వారి వద్ద పేలుడు పదార్థాలు ఉన్న బ్యాగును భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన దరిమిలా స్వర్ణాలయం లోపల, వెలుపల భద్రతను పటిష్టం చేయాలని ఎస్‌జిపిసి నిర్ణయించింది. అంతేగాక..ఏప్రిల్ 17న త్రివర్ణ పతాకం బొమ్మతో టాటూ వేసుకున్న ఒక యువతిని ఆలయ భద్రతా సిబ్బంది అడ్డుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో మహిళా భద్రతా సిబ్బందిని ఆలయ ప్రవేశం వద్ద నియమించాలని నిర్ణయించినట్లు ఎస్‌జిపిసి ప్రధాన కార్యదర్శి గురుచరణ్ సింగ్ గ్రేవల్ తెలిపారు. ఎల్‌ఇడి స్క్రీన్లపైన పంజాబీ, హిందీ, ఇంగ్లీష్ భాషలలో సమాచారం అందచేస్తామని ఆయన చెప్పారు. ఆలయ ప్రవేశ పాయింట్ల వద్ద సిసిటివిలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నామని, దీనికి ఎస్‌జిపిసి కార్యనిర్వాహక వర్గం ఆమోదం తెలియచేయాల్సి ఉందని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News